బిగ్ బాస్ కి సమంత వస్తే ఎలిమినేషన్ ఉండదా.. ?

Satvika
తెలుగులో సక్సెస్ ఫుల్ గా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో బిగ్ బాస్.. ఈ షో రోజు రోజుకు పాపులర్ అవుతుంది.. అయితే ఈ షో ఇప్పుడు రచ్ఛలకు దారి తీసింది.. ఒక వైపు రొమాన్స్, మరో వైపు గొడవలు ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే హైలెట్స్ అని అందరూ అనుకుంటారు.కానీ ప్రజలకు మాత్రం ఆ షో బూతులను తల పిస్తుంది.. ఈ మేరకు షో ప్రశంసలు విమర్శలు అందుకుంటుంది. మొత్తానికి ఈ షో ఎప్పుడు ముగుస్తుందో అని అనుకుంటున్నారు..మరి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి..

ఇది ఇలా ఉండగా.. ఈ షో కి హోస్ట్ గా ఉన్న నాగ్ ఇప్పుడు షో లో కనిపించడం లేదట.. అందుకు కారణం కూడా ఉంది.. అందరికీ తెలిసిందే.. నాగ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే.. లాక్ డౌన్ కన్నా ముందే ఆయన సినిమాలు మొదలు అయ్యాయి. కానీ కరోనా పెరగడం తో షూటింగ్ లు ఆగిపోయాయి. ఇప్పుడు అన్ లాక్ డౌన్ ఉండటంతో నాగ్ వరుస సినిమాలలో నటించడానికి వెళ్తున్నాడు.నాగార్జున రానున్న రెండు వారాల్లో మాత్రం బిగ్ బాస్ తెరపై కనిపించననే హింట్ ఇస్తూ నిన్ననే ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను మనాలీలో 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్‌లో ఉన్నానని, కొన్నిరోజుల తర్వాత కలుద్దామని చెప్పారు.


తాజాగా ఈ వార్త నిజమని మరో వీడియో ను బిగ్ బాస్ విడుదల చేశారు.. దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున బదులుగా సమంతనే కనిపించనుందని కన్ఫమ్ చేశారు. ఈ వీకెండ్‌లో సమంతనే తెరపైకొచ్చి ఇంటి సభ్యులను పలకరిస్తారని ప్రోమో తో కన్ఫర్మ్ చేశారు.అక్కినేని అభిమానులతో పాటు బుల్లితెర ఆడియన్స్ అంతా సమంతను చూసే ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి సమంత వచ్చిన ఆనందంలో ఎలిమినేషన్ ఉండదు అనే టాక్ వినపడుతుంది మరి ఈ వార్తలో నిజమెంతో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: