ఇంటింటి గృహలక్ష్మి.. తులసికి ముంచుకొస్తున్న ముప్పు.. తప్పించుకోవడానికి ప్రయత్నాలు..

Satvika
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రస్తుతం ట్విస్టుల మీద నడుస్తుంది.. మొన్నటిదాకా తులసి ఒక్కటే బాధపడుతుంది అనుకున్నారు.. ఆమె భాదను దేవుడు అర్థం చేసుకున్నా డేమో .. లాస్యకు షాక్ ల మీద షాకు లు ఇస్తున్నారు.. తులసి ఫంక్షన్ లో పడిపోవడంతో హాస్పిటల్ లో చేర్పించారు.. అక్కడ లాస్య భర్త శేఖర్ వెళ్లి మాట్లాడతాడు.. నీకు ఇష్టం లేకపోయినా నీ భర్తకి విడాకులు ఇస్తున్నావని నాకు తెలుసు.. నా భార్య, నీ భర్త గాడి తప్పిపోయారు. వాళ్లకి మనం విడాకులు ఇవ్వకపోతే చచ్చినట్లు మన దగ్గరే పడి ఉంటారు.. నువ్వు విడాకులు ఇవ్వొద్దని సలహా ఇవ్వడానికి వచ్చాను..’ అంటూ శేఖర్ చెబుతుంటే.. ‘నేను విడాకులు ఇవ్వకుండా ఉన్నంత మాత్రాన్న నా భర్తలో మార్పు వస్తుంది అనుకోవడం నా అమాయకత్వం అంటూ బాధపడుతుంది..



అందుకు శేఖర్ మాత్రం..అవును నువ్వు నేను విడాకులు ఇవ్వకుంటే వాళ్ళు చచ్చినట్లు మనతోనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.. దానికి తులసి మాత్రం నువ్వే ఏం చేసినా కానీ నేను మాత్రం లాస్యకి విడాకులు ఇవ్వను.. తను ఉండే ఇంట్లో ఉండనివ్వకుండా రచ్చ చేసి వచ్చాను.. వాళ్లు ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టను..’ అంటూ విలన్‌లా మాట్లాడుతుంటే.. ఎలా నీ భార్యను మొదటి నుంచి సరిగ్గా ఉంచుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ అంటుంది..




అందుకే అతను మొండిగా ప్రవర్తిస్తాడు..తాను చెప్పిందే వినాలని అంటాడు..ఇంకా తులసిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ‘ఏం చెయ్యాలి ఏం వద్దు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.. కానీ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో.. లాస్యతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు.. ఒక ఆడది కోరుకునే ఆదర్శమైన భర్తగా ఉండటానికి ప్రయత్నించు.. అప్పుడు లాస్య నీ కోసం ఎక్కడున్నా కూడా వస్తుంది..అంటూ తులసి అనగా అతను లెక్క చేయకుండా నీకు సలహా ఇద్దామని వచ్చాను.  ఇంక నీ ఇష్టం అంటూ కోపంగా వెళ్ళిపోతాడు.. అయితే రేపటి ఎపిసోడ్ లో తులసి దగ్గరకు భర్త నందు వెళ్తాడా.. అప్పుడు ఇద్దరు కలుస్తారా ఈ కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు..ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ ను చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: