బిగ్ బాస్ 4: లాస్య ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదే..?
ఇకపోతే బిగ్ బాస్ హీరో అభిజిత్ ఫ్యాన్స్ రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. మరో ఆర్మీ తయారు అయిన ఆశ్చర్యం లేదు.. వాళ్ళే ఆయన రొమాన్స్ పాట్నర్ అయిన హారికాకు కూడా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.. గత నాలుగు వారాల నుంచి అమ్మడు ఎలిమినేషన్ వరకు వెళ్లి సేఫ్ అవుతుంది. మోనాల్ ఖాతాలో లాస్య కూడా చేరినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరొందిన మోనాల్ ఈవారం ఎలిమినేట్ కావడం ఖాయమే అనుకున్నారంతా.. అన్ని పోల్స్‌లో కూడా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు స్పష్ఠమైన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఎంత మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా మోనాల్ మాత్రం సేవ్ అవుతూనే వస్తోంది. ఈవారం కూడా ఇదే రిపీట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో దేవి నాగవల్లి, కుమార్ సాయి, దివి లాంటి వాళ్లను ఊహించని రీతిలో ఎలిమినేట్ చేసి మోనాల్‌ని సేవ్ చేసిన బిగ్ బాస్ ఈసారి తన ఆ అమ్మడు కోసం లాస్యను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు..
మోనాల్ కు ఈ వారం మంచి మార్కులు పడ్డాయి.. ఎందుకంటే హారికను భుజాలపై ఎక్కించుకుని సొహైల్, అఖిల్, అవినాష్, అభిజిత్‌లతో పోటీ పడిన తీరు ఈ సీజన్‌కే హైలైట్ అనిచెప్పాలి. నా వల్లే మోనాల్ ఇక్కడ వరకూ రాగలిగిందని.. ఆమెకు అసలు ఆటే రాదని చెప్పిన అఖిల్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అఖిల్‌కి ఝలక్ ఇచ్చి హారికను బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌ని చేసింది.ఇకపోతే ఎప్పుడు కిచెన్ లో ఏదోకటి చేస్తూ బిజీగా ఉన్న లాస్య టాస్క్ లలో పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోలేక పోయింది..మోనాల్ ఎప్పుడు సేఫ్ అవుతూనే వస్తుంది.. బిగ్ బాస్ ఆమె పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపడం పై అందరూ మండి పడ్డారు.. ఏమౌతుందో మోనాల్ ను విన్నర్ గా చేసినా ఆశ్చర్యం లేదు అంటూ జనాలు గుసగుసలాడుకుంటన్నారు.. రేపటి ఎపిసోడ్ లో ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో చూడాలి..