ఫాన్స్ చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న కార్తీక దీపం వంటలక్క

Mamatha Reddy
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్ ల లో నెంబర్ వన్ గా నిలుస్తోంది. బుల్లితెర బాహుబలి గా పేరు తెచ్చుకున్న కార్తీకదీపం సీరియల్ రెండు సంవత్సరాలు అయినా.. రేటింగు లలో మాత్రం నెంబర్ వన్ గానే కొనసాగడం విశేషం. అయితే ఈ సీరియల్ లో నటించే ప్రేమి విశ్వనాథ్ బుల్లితెర ప్రేక్షకుల మనసులను చూరగొంటున్నారు. కార్తీకదీపం సీరియల్ తో ఎనలేని పాపులారిటీని సంపాదించుకున్న ఈమెను స్మాల్ స్క్రీన్ సావిత్రి అని అభిమానులు పిలుస్తున్నారు.

అలనాటి మహానటి సావిత్రి ప్రేమి విశ్వనాథ్ రూపం లో మళ్లీ పుట్టిందని వీడియోలు ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియా వేదికగా వదులుతున్నారు. దీంతో ప్రేమి విశ్వనాథ్ బాగా సంతోష పడిపోతున్నారు. బుల్లితెర సీరియల్ లలో నటించే వారి పేర్లు కూడా తెలియని మనకు మొదటిసారిగా కార్తీకదీపం సీరియల్ లో ప్రధాన పాత్ర లో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఆమె పై ప్రేమతో అభిమానులు ఆమె గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని బయట పెట్టారు. ప్రేమి విశ్వనాథ్ మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి మరీ ఆరాధిస్తున్నారు. జనాల గుండెల్లో ప్రేమి విశ్వనాథ్ వంటలక్క గా నిలిచిపోయారు.

​https://www.instagram.com/p/CJjoNwHntIN/?utm_source=ig_web_copy_link​​​

మొన్నీమధ్య స్టార్ మా ఛానల్ వాళ్ళు కార్తీకదీపం సీరియల్ నుంచి ప్రేమి విశ్వనాథ్ ని తీసేస్తున్నామని ప్రకటించినట్టు వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం ప్రేమి విశ్వనాథ్ ని తీసేస్తే స్టార్ మా ఛానల్ ని బహిష్కరిస్తామని పెద్ద ఎత్తున సైబర్ ధర్నా చేశారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లో పెద్ద వర్షాలు రాగా.. నగరవాసుల ఇల్లులు నీట మునిగాయి. అయినా కూడా వంటలక్క సీరియల్ వచ్చే సమయంలో టీవీ లు ఆన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు జనాలు. ఈ సీరియల్ కి ఆ లెవల్లో ఆదరణ ఉండబట్టే టిఆర్పి రేటింగ్ ఆ స్థాయిలో వస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు తనని అలనాటి సావిత్రి తో పోల్చడం తో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: