కార్తీక దీపం 'వంటలక్క'ను మహానటి సావిత్రితో పోల్చుతూ చేసిన వీడియో వైరల్

SS Marvels
70వ దశకంలో దక్షిణాది వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి కోట్లాది మంది సినీ ప్రేక్షక అభిమానుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న మహానటి.. సావిత్రి, ఆమె తర్వత మరలా ఆ స్థాయి నటిగా పేరు సంపాదించిన నటి సౌందర్య. అయితే ఇక ఇటీవలే హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి నేటితరం వెండితెర మహానటి అని నిరూపించుకుంది.  ఇక ఇప్పుడు తాజాగా బుల్లితెరపై కూడా మహానటి ఉందని, ఆమె మరెవరో కాదు వంటలక్క అని అంటున్నారు ఆమె అభిమానులు. అంతేకాకుండా ఏకంగా సావిత్రితో ఆమెను పోలుస్తూ ఓ వీడియో రెడీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉబ్బి తబ్బిబ్బయింది వంటలక్క ‘ప్రేమి విశ్వనాథ్’.



కార్తీక దీపం సీరియల్ ద్వారా అందరికి సుపరిచితమైన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్‌. స్వతహాగా మలయాళీ నటి అయినప్పటికీ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్నితెరపై వంటలక్క కనిపిస్తే చాలు చిన్నాపెద్దా అంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. మొన్నామధ్య హైదరాబాద్‌లో వరదలు వచ్చిన సమయంలో ఇంటినిండా వరద వచ్చి చేరినా వంటలక్క కార్తీకదీపం సీరియల్ చూస్తూ ఆశ్చర్యపరిచింది ఓ ఫ్యామిలీ. వంటలక్క ఫాలోయింగ్ గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేదు. ఇక మహిళా మణులైతే వంటలక్క అభినయానికి ఫిదా అయి చూసిన ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ చేస్తుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆమె నటనకు ఆకర్షితులైన అభిమానులు మహానటి సావిత్రితో ఆమెను పోలుస్తూ ఓ వీడియో రూపొందించారు. సావిత్రి, వంటలక్క ఫొటోలను పక్కపక్కనే పెట్టి అనుష్క 'అరుంధతి' సినిమాలోని ''నా పేరు పెట్టండి.. నేనే మళ్ళీ పుట్టానని నమ్మండి, నాకిచ్చిన గౌరవమే తనకీ ఇవ్వండి'' అనే డైలాగ్ జత చేసి వీడియో రెడీ చేశారు. ఈ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్న వంటలక్క.. థాంక్యూ సో మచ్ ఫర్ క్రియేషన్. ఆమె నటనలో కొంచెం చేసినా.. నా జన్మ ధన్యం అని తెలిపుతూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: