బర్రెలు కాచే వాడిని..నన్ను సెలబ్రిటీ ని చేసాడు ఆ వ్యక్తి : కమెడియన్ లండన్ రాజు
అయితే తన తండ్రి అత్యంత దయనీయమైన పరిస్థితిలో చనిపోవడంతో తన తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారట. ఒకవైపు బాగా రోదిస్తున్న తన తల్లిని.. మరోవైపు చనిపోయిన తన తండ్రిని చూసి.. లండన్ రాజు బాగా ఏడ్చాడట. తన తండ్రి చనిపోతే తమ గ్రామస్తులలోని ఒక్కరు కూడా చూడ్డానికి రాలేదని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ లండన్ రాజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
లండన్ రాజు అసలు పేరు వెంకటేశ్వర్లు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ అనే ఒకే ఒక్క డైలాగ్ తో జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. ఈయన తల్లిదండ్రులు ఒంగోలు లోని ఒక చిన్న పల్లెటూరు లో వ్యవసాయం చేసేవారు. అయితే ఒకరోజు ఆయన తండ్రి పొలం పనులు ముగించుకొని ఇంటికి రాగానే తీవ్ర జ్వరం వచ్చింది. ఆ జ్వరం తోనే ఆయన మరణించారు. ఐతే చేతిలో చిల్లిగవ్వ లేని లండన్ రాజు ఏం చేయాలో తెలియక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక చేసేదేమీలేక ఆయన తనకున్న 2 బర్రెలను కాస్తూ జీవితాన్ని సాగించడం ప్రారంభించారు.
అయితే ఈ సమయంలోనే హైపర్ ఆది లండన్ రాజు ని జబర్దస్త్ కి తీసుకొచ్చారు. ఆ విధంగా జబర్దస్త్ షో కి వచ్చిన లండన్ రాజు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రతి టీమ్ లీడర్ స్కిట్ లో ఆయన నటించి ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఐతే కొద్ది రోజుల్లోనే ఆయన జబర్దస్త్ లో సంపాదించిన డబ్బులతో తన గుడిసె ఇంటిని తీసేసి రెండు గదుల డాబా ఇల్లు కట్టించుకోగలిగాడు.