బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ ల మధ్య సాగింది. తన భర్తను ఎలాగైనా దక్కించుకోవాలని దీప చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుంది. డాక్టరు బాబు, దీపఎప్పటికీ కలుసుకుంటారు.. అనే అంశం మీద సీరియల్ నడుస్తుంది. ఇప్పుడు సీరియల్ చివరి ఘట్టంలో ఉందని తెలుస్తుంది.
ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది..రూమ్‌కి వెళ్లి ఉంటుంది అనుకుంటూనే వెతుకుతుంది. తీరా బయటికి వెళ్లినా కనిపించకపోయే సరికి.. సౌర్యని లేపి విషయం చెబుతుంది. దాంతో ఇద్దరూ సరోజినీ ఇంటి దగ్గర, రోడ్డుపైన అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు హిమ. దాంతో వారణాసికి కాల్ చేసి ‘నీ దగ్గరకు వచ్చిందా? నీ ఆటోలో డాక్టర్ బాబు ఇంటికి వెళ్లిందా?’ అంటే.. ‘అసలు హిమ నా దగ్గరకే రాలేదు’ అంటాడు. దాంతో దీప ఏడవడం మొదలుపెడుతుంది. సౌర్య కూడా కంగారుపడుతుంది. దాంతో వారణాసి.. ‘అక్కా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా’ అంటాడు.
కాగా , అప్పుడే వచ్చిన కార్తిక్ హిమ లేదన్న విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. అంతేకాదు దీప ను నిలదీస్తూ గట్టిగా అరుస్తాడు.కార్తీక్ బయటికి అడుగుపెట్టగానే మోనిత కాల్ చేస్తుంది. కార్తీక్ కోపంగా ‘ఏంటి?’ అనగానే.. ‘కార్తీక్ హిమ నా దగ్గరకు వచ్చింది.. ఇప్పుడు ఇక్కడే ఉంది..’ అనగానే.. ‘హి..హిమ అక్కడ ఉందా.. సరే నేను వస్తున్నాను’ అంటాడు కార్తీక్. అది విన్న దీప కాస్త కూల్ అవుతుంది కానీ.. కార్తీక్ దీపతో ఏం మాట్లాడకుంటా కారు వేసుకుని వెళ్లిపోతాడు.
హిమని బిస్కట్స్ తీసుకోమంటుంది మోనిత. వద్దంటూనే.. ‘ఇంట్లో అమ్మ కంగారు పడుతుంది. నేను వెళ్లాలి..’ అంటుంది. ‘నేను మీ డాడీకి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాను. వస్తున్నాడు’ అంటుంది మోనిత. ‘డాడీకి ఎందుకు చెప్పారు’ అంటుంది హిమ. ‘నా దగ్గరే కదా.. ఏం అనడులే.. అయినా మీ డాడీనేగా’ అంటుంది మోనిత నవ్వుతూ. ‘మీరు మా అమ్మానాన్నలని తొందరగా కలపండి ప్లీజ్.. నాకు ఇద్దరూ కావాలి..’ అంటుంది.. రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..