కార్తీకదీపం మౌనిత అస్సలు పేరేంటో తెలుసా..? ఈమె గురించి ఆసక్తికర విషయాలు
ఈ సీరియలో ఆమె విలనిజంని బాగా పండించింది. అంతే కాదు ఆమె చేసే కుట్రలు డాక్టర్ బాబుకు తెలియకుండా ఫేస్ లో ఆమె మార్చే ఎక్స్ ప్రెషన్స్ సూపర్ గా ఉంటాయి. శోభాశెట్టి నటనే కాదు..ఆమె వేసుకునే డ్రెస్ లు కూడా చాలా ఎట్రాక్టివ్ గా ఉంటాయి. మంచి మంచి కలర్ ఫుల్ డ్రెస్ లో అందగా కనిపిస్తుంది.
తెలుగుతో పాటు పలు కన్నడ సీరియల్స్ లోనూ శోభాశెట్టి నటిస్తుంది. తెలుగులో మొదటగా అగ్ని సాక్షి సీరియల్ లో బుల్లితెరపై అరంగేట్రం చేసింది. కార్తీక దీపం సీరియల్ తో పాటు ఈటీవీలో లాహిరి లాహిరి లాహిరి సీరియల్స్ లోనూ శోభా శెట్టి నటించి మంచి పేరు తెచ్చుకుంది. కర్ణాటకలో సైతం ఇటీవలె ఓ సీరియల్ కు సైన్ చేసింది. రుక్కు అనే సీరియల్ లో లీడ్ రోల్ ప్లే చేస్తుంది. అది ఓ పల్లెటూరి అమ్మాయి కారెక్టర్. ఈ సీరియల్ ఇటీవలే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలను శోభాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇక ఈ సీరియల్ లో ఆమె కీ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం.