నోయల్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియా లో వైరల్...

Satvika
ర్యాపర్ నోయల్ అంటే చాలా మందికి తెలియదు.. కానీ బిగ్ బాస్ ఫేమ్ అందరికీ తెలుసు.. ఎందుకంటే ఈ షో ద్వారా చాలామంది అనుకున్న దానికన్న, కూడా బాగా ఫేమస్ అయ్యారు. దాంతో అందరి దృష్టిను తనవైపు లాక్కున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో వాడేందుకు స్టార్ మా బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వారి తో కొత్త షోలను ప్లాన్ చేసింది. ఈక్రమంలో స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ వంటి షోలను ప్రారంభించారు. అందులోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఎవరి గ్యాంగ్‌లకు సంబంధించిన వాళ్లనే పిలిచారు..



సుమ హోస్ట్‌గా మొదలైన స్టార్ట్ మ్యూజిక్ షోలో లాస్య, హారిక, నోయల్ ఒక టీంగా పాల్గొన్నారు. ఇక సోహెల్, మెహబూబ్, అఖిల్ మరో టీంమేట్స్‌గా వచ్చారు. అలా మొత్తానికి ఎవరి గ్యాంగ్‌లను వారితో కంబైన్ చేసి ఆటలు ఆడించింది. ఈ ఎపిసోడ్ బాగానే క్లిక్ అయింది.. ఇకపోతే నాలుగవ సీజన్‌లో నోభికస్య గ్రూపుకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నోయల్, అభిజిత్, హారిక, లాస్యల కాంబోను అందరూ ఇష్ట పడుతుంటారు. బిగ్ బాస్ షో ముగిశాక.. ఈ నలుగురు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు.



అందరూ ఒకసారి బయట కలిస్తే చూడాలని జనాలు అనుకున్నారు.. ఆలాంటి సందర్భాలు ఇప్పటి వరకు రాలేదు. సుమ హోస్ట్ గా చేస్తున్న ఈ షో లో అలాంటి అవకాశం కలిగింది. అందరూ ఒక వేదిక మీద తలుక్కు మన్నారు. కొంత మంది మనుషులు మధ్య బంధాలు ఎప్పటికీ చెరిగిపోవు.. వారి మధ్య ఎడబాటు రాదు.. ఏది ఏమైనా కూడా మళ్లీ కలిసి పోయేందుకు దారిని ఏర్పరచుకుంటారు. ఇప్పుడు ఈ షో లో అందరి కలిశారు.ఈ షో వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అతని స్పీచ్ అందరికి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: