అందరు అదే చూస్తున్నారని మోనాల్ జాకెట్ వేసుకునే ఉంటుంది..?
ఓవైపు బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక మోనాల్, అఖిల్, సోహెల్, మెహబూబ్ వంటి వారంతా కలిసి రచ్చ చేస్తున్నారు.. మరో వైపు లాస్య, హారిక, నోయల్ వంటి వారు.. ఇంకో వైపు అరియానా, అవినాష్‌లు కలిసి రచ్చ చేస్తుంటారు. అంతే కాకుండా స్పెషల్ ఈవెంట్‌లు, షోలతోనూ రచ్చ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఉత్సవం పేరిట స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి కంటెస్టెంట్లు అందరూ హాజరయ్యారు. ఇందులో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలోనే ప్రేమను చూపించారు.
బిగ్ బాస్ ఉత్సవంలో కంటెస్టెంట్లు అందరూ నచ్చిన వాళ్లకు కానుకలు తీసుకు వచ్చారు. ఇందులో అఖిల్ సార్థక్.. సయ్యద్ సోహెల్ రియాన్‌కు షూ ఇచ్చాడు. ఆ తర్వాత మోనాల్ గజ్జర్‌కు పట్టీలను తీసుకొచ్చాడు. అంతేకాదు, తాను మోకాళ్లపై కూర్చుని ఆమెకు స్వయంగా అలంకరించాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. ‘మోనాల్ ఎక్కడికి వెళ్లినా ఇవే చూస్తారు' అన్నాడు.ఇదే ఈవెంట్‌లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్ సార్థక్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఆమె ఎక్కడికి వెళ్లినా ఒక జాకెట్ వేసుకుంటుంది. ఎందుకంటే అది గిఫ్టుగా వచ్చింది' అని చెప్పుకొచ్చాడు. మధ్యలో కలుగజేసుకున్న యాంకర్ శ్రీముఖి.. ‘నువ్వు పట్టీలు పెట్టావు కదా.. ఇకపై మోనాల్ కాళ్లనే చూస్తారు' అని అదిరిపోయే పంచ్ విసిరింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు.