చంద్రకు ఇదేం పిచ్చి రా బాబు.. ఛీ.. ఛీ..
లేడీ గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. ఆ షోలోనే నెంబర్ వన్ కమెడియన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత వేరే షోలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే చంద్ర ఓ 'లేడీ' ఆర్టిస్టుతో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు.కమెడియన్‌గా బుల్లితెరపై తన మార్క్ చూపిస్తోన్న చమ్మక్ చంద్ర.. టీవీ షోలకే పరిమితం కాలేదు. సుదీర్ఘమైన కెరీర్లో సినీ రంగంలోనూ అతడు తన మార్క్‌ను చూపించాడు. 'అ ఆ', 'అరవింద సమేత', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'రాజా ది గ్రేట్', 'టాక్సీవాలా' సహా ఎన్నో సినిమాల్లో మంచి నటనను కనబరిచాడు. 'బాబు బంగారం' అనే సినిమాలో అతడి లేడీ గెటప్ హైలైట్ అయింది.
జీ తెలుగులో ప్రసారం అయిన 'అదిరింది' షో అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో చమ్మక్ చంద్ర స్టార్ మాలో ప్రారంభం అయిన 'కామెడీ స్టార్స్' అనే షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. చమ్మక్ చంద్ర పాటు అవినాష్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఒక స్కిట్ చేశాడు.స్కిట్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులతోనే సాగింది. 'నువ్వు పిసకవు.. వేరే వాళ్లనూ పిసకనివ్వవు'.. 'ఇంట్లో మా ఆయన లేడు.. పని కానిద్దామా'.. 'ఆవు ఆంబోతుకు అలవాటు పడినట్లు.. నువ్వు వాడిని పిసుకుడికి అలవాటు పడ్డావేంటే' వంటి డైలాగులు చిరాకు తెప్పిస్తున్నాయి. వాళ్లకు తోడు శేఖర్ మాస్టర్, యాంకర్ వర్షిణి కూడా డైలాగులు అదే తరహా లో ఉండటం గమనార్హం.. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది..