తన కొడుకు అలాంటివాడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన షణ్ముఖ్ తల్లి
అయితే షణ్ముఖ్ హిట్ అండ్ రన్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలు కి తరలించారు. ఈ నేపథ్యం లో షణ్ముఖ్ తల్లి అతడి పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె చెప్పిన విషయాల ప్రకారం, కారు నడిపిన క్రమంలో షణ్ముఖ్ అంత ఎక్కువగా ఏమి తాగలేదని, అది ఒక పొరపాటుగా మాత్రమే చూడాలని, కావాలని చేసింది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు షణ్ముఖ్ చేసిన ప్రమాదం గురించి మీడియా అత్యుస్త్సహాన్ని కూడా ఆమె విభేదించారు. విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూపించవద్దంటూ ఆమె చెప్పారు. మరి షణ్ముఖ్ చేసిన పనికి అతడికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు కానీ, బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.