బిగ్ బాస్ బ్యూటీ దివి డైట్ ఫుడ్ ఇదేనట..
ఈ మేరకు అధికంగా ప్రోటీన్ల ను అందించే సీఫుడ్ అంటే తనకెం తో ఇష్టమని సినీనటీ, బిగ్‌బాస్ ఫేం 'దివి' తెలిపింది. పోషక విలువలు కలిగిన మంసాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని ప్రొటీన్స్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా దివి నియమితు లైంది. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించి మీడియా తో ఆమె మాట్లాడారు. వీలైనంత వరకు తన ఫుడ్ డైట్ లో సీ ఫుడ్ ఉండేలా చూసుకుంటానని, ప్రస్తుతం యాంత్రిక జీవితం లో ఇలాంటి ఫుడ్ అవసరమన్నారు.
అనంతరం నిర్వాహకులు విజయ్ మాట్లాడుతూ.. సీఫుడ్ అందిచండం లో మాకెంతో ప్రత్యేకత ఉందని, ఆంధ్రా, తెలంగాణ లో తర్వర లో 100 ప్రోటీన్స్ మార్ట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న దివి ఇలాంటి వాటి గురించి చెప్పడం అతిశయోక్తి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటించనుంది.. మరో సినిమా లో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది..