ఇది కదా న్యూస్ అంటే..బిగ్ బాస్ సోహైల్ ఏకంగా ఆ ఛాన్స్ కొట్టేశాడు..!!
నిజమేనండీ. బిగ్ బాస్ షో బజ్ అనే ప్రోగ్రాం మా మ్యూజిక్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తనీష్, రాహుల్ సిప్లిగంజ్ లు ఈ షో ని హోస్ట్ చేయగా త్వరలోమొదలవబోయే షో కి సోహైల్ హోస్ట్ గా చేయనున్నాడట.. జూన్ లో ప్రారంభమయ్యే ఈ షో కి బిగ్ బాస్ యూనిట్ గతంలో ఎన్నడూ రానివిధంగా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ ని కూడా సెలెక్ట్ చేసింది.. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నవారిని వడపోసింది.. త్వరలోనే లిస్ట్ ను కూడా రిలీజ్ చేయనుంది..
ఇక సోహైల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బిగ్ బాస్ లో అలరించి మెగా స్టార్ పొగడ్తను అందుకున్నాడు.. అంతేకాదు ఆయననే తన సినిమాల్లో నటింపచేసే ఛాన్స్ కొట్టేశాడు. బిగ్ బాస్ సీజన్ ఫినాలే లో చిరంజీవి ప్రకటించిన వరాల్లో సోహైల్ కే ఎక్కువ వరాలు పొందాడని చెప్పొచ్చు.. ఇక ఫినాలే లో అతను 25 లక్షల క్యాష్ తో బయటకి వచ్చి సంచలనం సృష్టించాడని చెప్పొచ్చు.. ఏదైతేనేం సీజన్ 4 కంటెస్టెంట్ లను మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్న అభిమానులకు సోహైల్ ఈవిధంగా వారి కోరికను నెరవేర్చుతున్నాడు.