పోసాని ని అవమానించిన హైపర్ ఆది.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!
అంతేకాదు తనలాంటి ఎంతో మంది రచయితలను పరిచయం చేశారు పోసాని.. ఇప్పటి టాప్ రచయితలు, దర్శకులు అయిన త్రివిక్రమ్, కొరటాల శివ లు అయన దగ్గర శిష్యరికం చేసిన వారే కావడం విశేషం. అయితే తాజగా ఈటీవీ లోఓ ప్రోగ్రాంకి గెస్ట్ గ వచ్చిన పోసానికి అవమానం జరిగిందని ఫీల్ అవుతున్నారు అయన అభిమానులు. ఇటీవలే జాతిరత్నాలు ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఉగాదికి రాబోతున్న ఈ ప్రోగ్రాం లో పోసాని ని హైపర్ ఆది అవమానించాడని ఫైర్ అవుతున్నారు.
జాతిరత్నాలు సినిమాలోని ఓ డైలాగ్ ను పేరడీ చేస్తూ హైపర్ అది "మా దగ్గర టాలెంట్ ఉంది.. మీ దగ్గర అనుభవం ఉంది అని అన్నాడు.. దానికి పోసాని అంటే నా దగ్గర టాలెంట్ లేదన్నా అంటే ఆది మా దగ్గర అనుభవం లేదంటున్నాను సర్ అని కౌంటర్ ఇచ్చాడు.. ఇందులో పోసాని ని అవమానించాడనికి ఏదీ లేకపోయినా తన అభిమాన నటులపై ఈగవాలిన క్షమించరు కొంతమంది అభిమానులు.. దర్శకుడిగా కూడా అయన చాలా సినిమాలకు పనిచేశారు. అయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా కాగా ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి అవార్డులు కూడా దక్కాయి.