డాక్టర్ బాబుకు ముద్దు పెట్టిన వంటలక్క..కొట్టినా కూడా అలా..
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ వరల్డ్ లోనే అత్యదిక రేటింగ్ అందుకుంటున్న ఏకైక సీరియల్. రేటింగ్స్ అందుకోవడంలో ప్రతి రోజు అగ్ర హీరోల సినిమాలను సైతం డామినేట్ చేస్తున్న ఈ సిరియల్ రోజుకో రికార్డ్ అందుకుంటోంది. ఇక ఈ నెంబర్ వన్ ఫ్యామిలీ డ్రామా ఈ మధ్య మరింత ఆసక్తి గా మారింది. దీప అనారోగ్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.ప్రతి రోజు మందులు వేసుకోవాలని జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం అనే పాయింట్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు.
ఇక విషయం తెలుసుకున్న డాక్టర్ బాబు కార్తిక్ ఆమెకు ఎమోషనల్ గా దగ్గరవుతుండడం ఆసక్తిగా మారింది. రోజు రోజుకు సిరియల్ లో సరికొత్త ట్విస్టులు క్రియేట్ అవుతున్నాయి.దీప ఎంత చెప్పినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఒప్పుకోదు. ఇక కార్తిక్ ఆమెను చెంపపై కొట్టడంతో ఒక్కసారిగా సిరియల్ లో ఎమోషన్ స్థాయి పెరిగిపోయింది. నీ మొగుడు అనే హక్కు తోనే చెప్పినా కూడా ఒప్పుకోవా అంటూ కార్తిక్ చెప్పడంతో వాతావరణం మారిపోతుంది. దీప కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంది.. ఆ క్రమంలో దీప అతన్ని ముద్దు పెట్టుకుంది.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.