ఆ మెగా రియాలిటీ షో పై నీలి నీడలు...?
మరి కొందరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక క్రేజీ అవకాశాలను అంది పుచ్చుకున్నారు. కరోనా సమయంలో కూడా బిగ్ బాస్ సీజన్ 4 ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు త్వరలో మొదలు కావాల్సిన బిగ్ బాస్ సీజన్ 5 పై ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సీజన్ 5 ఎప్పుడు మొదలవుతుంది... అసలు మొదలు అవుతుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. సీజన్ 4 పూర్తి కాగానే... సీజన్ 5 ను నిర్వహించడానికి యాజమాన్యం దృష్టి సారించింది అని వార్తలు వస్తున్నాయి. కానీ కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టెప్ ఇప్పుడప్పుడే తీసుకోవడం మంచిది కాదని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత తెలుస్తున్న సమాచారం ప్రకారం సీజన్ 5 లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. భారీ ప్రజాదరణ పొందిన ఈ బుల్లితెర రియాలిటీ షో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు అభిమానులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.