బుల్లితెర మీద నటీనటులు ప్రేక్షకులను అలరిస్తూ , తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ వుంటారు. అయితే ఇటీవల కాలంలో చాలామంది బుల్లితెర నటులు పెళ్లి చేసుకోకుండా, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్నారు. అయితే ఎవరెవరు ఇప్పటి వరకూ 30 సంవత్సరాల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా, ప్రేక్షకులకు తమ నటనతో వినోదాన్ని పంచుతున్నారో తెలుసుకుందాం..
1. సుధీర్ :
సుధీర్ గురించి బుల్లితెర మీద, వెండితెర మీద ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద జబర్థస్త్, ఢీ, పోవే పోరా వంటి షోల ద్వారా బాగా పాపులారిటీని అందుకున్నాడు. అంతేకాదు వెండితెర మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సుధీర్ వయసు 33 సంవత్సరాలు.
2. అవినాష్:
జబర్దస్త్ కామెడీ షో లో ముక్కు అవినాష్ గా బాగా పాపులారిటీ అందుకున్న అవినాష్ , తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈయనకు 30 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
3. కార్తీక్:
అవినాష్ టీమ్ లో అవినాష్ పక్కన నటిస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ కార్తీక్. అంతేకాదు కెవ్వుకార్తిక్ గా పేరందుకున్న కార్తిక్ ,ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
4. ఆది :
వెండితెర పై స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది, ఇటీవల ఢీ డాన్స్ షో, జబర్దస్త్ కామెడీ షో లలో నటిస్తూ ,మంచి గుర్తింపు పొందుతున్నాడు . అయితే ఇతను కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
5. రాకేష్:
జబర్దస్త్ కామెడీ షో కు బాల నటులను పరిచయం చేసిన ఘనత కూడా రాకేష్ కి చెందినది అని చెప్పవచ్చు. పిల్లలతో పంచులు వేయించుకుంటూ, తాను చేసే స్కిట్ కు మంచి ప్రేక్షకాదరణను పొందుపరచుకుంటున్నాడు. అయితే రాకేష్ కూడా 30 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడం గమనార్హం.
6. ప్రదీప్:
ఢీ షో ద్వారా బుల్లితెర పై బాగా పాపులారిటీని అందుకొని, వెండితెరపై స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రదీప్ 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.