మళ్ళీ ఆమెనే నమ్ముతున్న టాప్ ఛానల్.. ఇక మారదా !

VAMSI
జబర్దస్త్ షో తర్వాత అందాల తార అనసూయ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై సత్తా చాటుతూ రోజు రోజుకు తన ఇమేజ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది మన రంగమ్మత్త. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోల కోసం ఫ్యాన్స్ పడిగాపులు కాస్తుంటారు. అంతగా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. అనసూయ భరద్వాజ్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అంటే కుర్రకారు గుండెకు బ్రేకులు పడవంతే . ఎవరైనా ఈమె అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే. పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వయసు మూడు పదులు దాటుతోంది అయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ లేదు.

 
తాజాగా అనసూయ గురించి వినిపిస్తున్న ఒక న్యూస్ టీవీ వీక్షకులను తెగ టెంప్ట్ చేస్తోంది. ఇంతకీ అదేమిటంటే త్వరలో ఓ కొత్త షోలో యాంకరింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట అనసూయ. అది మామూలు షో కాదు ఏకంగా  సెలబ్రిటీలనే ఇంటర్వ్యూ చేసే షో అట. ఈ షో కి వచ్చే సెలబ్రిటీల లైఫ్ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను ఆ సెలబ్రిటీల తోనే చెప్పించడానికి రెడీ అవుతోందట అనసూయ. గతంలో ఇలాంటి పలు సెలబ్రిటీ షో లు వచ్చినప్పటికీ ఈ షో మాత్రం వాటికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని, ఫుల్ స్పెషల్ అని వినికిడి. ఈ షోను జెమినీ టీవీలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే టిఆర్పి రేటింగ్ చాలా తక్కువగా ఉన్నందున ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు షోలు చేసినా సక్సెస్ కాలేదు. ఈ సారైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఓ వైపు అనసూయ మరియు ఈమె సెలబ్రిటీలతో చేసే హంగామా గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక ఆ షో రేటింగ్స్ మామూలుగా ఉండవు. మరి ఈ షో ఎప్పుడు మొదలవుతుంది అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా అంటే అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. అయితే పూర్తి వివరాల కోసం మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: