టీవీ: మేల్ యాంకర్స్ లో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా..
బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగించాలంటే అంత తేలికైన విషయం ఏమి కాదు. మాట్లాడడం బాగా వచ్చి ఉండాలి. సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేయాలి. అలా చేస్తేనే వారికి మంచి పేరు వస్తుంది. మహిళలు ఇలాంటి రంగంలో రాణించాలంటే పెద్ద కష్టమేమి కాదు. కానీ ఈ రంగంలో మగవారు రాణించడం అంటే ఆషామాషీ కాదు. బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా, బాగా పాపులర్ అయిన యాంకర్ లా గురించి,వారి ఆస్థి గురించి తెలుసుకుందాం.
1). ప్రదీప్:
తెలుగు టెలివిజన్ లో టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రదీప్. అందరి సెలబ్రిటీస్ తో ఆటపాటలతో నవ్విస్తూ తెగ ఆడేసికుంటాడు ప్రదీప్. తన సొంత ప్రొడక్షన్ లో "కొంచెం టచ్ లో ఉంటే చెప్తా" షో ని ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఈ మధ్యనే హీరోగా కూడా ఒక సినిమాని తీశాడు, అంతే కాకుండా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా పోషిస్తున్నాడు. ప్రదీప్ ఒక షో కి రూ.3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. సినిమా ఫంక్షన్లకి రూ.5 లక్షలు తీసుకుంటాడు. ప్రదీప్ కి రూ. 10 కోట్ల మేరకు ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.
2). రవి:
బుల్లితెరపై ఎక్కువగా పాపులర్ అయినా యాంకర్లలో రవి కూడా ఒకరు. అందులో (రవి, లాస్య )అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. రవి నెలకి రూ. 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక అంతే కాకుండా బంజారాహిల్స్ లో కోటి రూపాయలు విలువ చేసే ఒక ఇల్లు ఉంది. దాదాపు రూ.5 కోట్ల మేరకు ఆస్తి ఉంటుందని అంచనా.
3). సుడిగాలి సుదీర్:
బుల్లితెరపై సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అందులో రష్మీ సుధీర్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా ఉందంటే ఒక స్టార్ హీరోకి ఉన్నంతగా. ఇక ఈ మధ్యనే హీరోగా రెండు మూడు సినిమాలు తీశారు. సుధీర్ సంపాదన అప్పట్లో రోజుకి 20 వేల రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు రోజుకి రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. సినిమా ఫంక్షన్ కి దాదాపుగా రూ.2 లక్షల వరకు తీసుకుంటాడు. సుడిగాలి సుధీర్ కి దాదాపు రూ.5 కోట్ల పైనే ఆస్తి ఉన్నట్లు అంచనా.
4). హైపర్ ఆది:
తన పంచ్ డైలాగులతో, కామెడీతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించారు ఆది. ఇక అంతే కాకుండా సినిమాలలో లో కూడా కమెడియన్ గా నటిస్తున్నారు. ఆది కి దాదాపు 20 ఎకరాల వరకు పొలం ఉంది.4 ఫ్లాట్స్ ,2 సొంత ఇల్లు, 3 ఖరీదైన కార్లు, భారీగా బంగారం, ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.