టీవీ: సినిమా అవకాశం కొట్టేసిన వంటలక్క అత్త..
బుల్లి తెరపై మంచి టీ ఆర్ పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచీ, ఇప్పటి వరకూ ప్రేక్షకులను ఓకే విధంగా ఆకట్టుకుంటూ వస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. IPL తో పోటీగా నిలిచింది.
ఈ సీరియల్ ను మలయాళం భాష నుంచి తెలుగులోకి అనువాదం చేయబడిన సీరియల్ అని అందరికీ తెలుసు. ఇందులో ముఖ్యంగా వంటలక్క పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతే స్థాయిలో ఈ సీరియల్ లో వంటలక్కకు అత్త పాత్రలో నటించే అర్చన కూడా అంతే ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు.
ఇక అర్చన కూడా మాటీవీ లో ప్రసారమయ్యే "కేరాఫ్ అనసూయ"అనే నాటికలో ప్రధాన పాత్రలో నటిస్తున్నది. ఇక పోతే ఈ మధ్యకాలంలో బుల్లితెర పై నుండి వెండితెరపైకి కూడా వెళ్లి నటీమణులు తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అర్చన అనసూయ చేసిన సినిమా"థాంక్యూ బ్రదర్" అనే అని మూవీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ మెప్పించింది.
ఇక అంతే కాకుండా ఈమెకు ఇప్పుడు ఒక ఆఫర్ వెతుక్కుంటూ వచ్చిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక వారి సమాచారం ప్రకారం, ఈమె బుల్లితెరపై అత్తగా, అమ్మగా తన వయసుకు మించిన పాత్రలు చేస్తున్నది. కానీ ఈమె ప్రస్తుతం ఇప్పుడు ఒక స్టార్ హీరో సరసన సోదరి పాత్రలో కనిపించనుందని సమాచారం. అంతే కాకుండా కార్తీకదీపం సీరియల్ చూస్తున్న ఒక ప్రొడ్యూసర్ ఈమెకు ఛాన్స్ ఇచ్చాడని సమాచారం. ఇక ఆమె సీరియల్ లో ఎంత బాగా నటించిన మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా అర్చనకు ముందు నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. ఇక ఈ సినిమాల ద్వారా ఆమె కోరిక తీరింది అని చెప్పవచ్చు.