టీవీ : ప్రముఖ సీరియల్ నటి అనితా చౌదరి భర్త ఎవరో తెలుసా..?

Divya

కొంతమంది  హీరోయిన్ లు ఎంతో అందంగా ఉన్నా, టాలెంట్ ఉన్నా, అదృష్టం లేక స్టార్డమ్ ను సంపాదించలేక పోతుంటారు. అలాంటి వారిలో అనితా చౌదరి కూడా ఒకరని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించినా, తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయింది. అయితే ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


జెమినీ టీవీలో రాహుతో కలిసి తొలిరోజుల్లో పోస్ట్ బాక్స్ నెంబర్..1562 అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ చేసింది  యాంకర్ అనితా చౌదరి. ఇక ఈమె అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆడియన్స్  రాసిన ఉత్తరాలకు ఓపిగ్గా సమాధానమిచ్చే ప్రోగ్రాం ఇది. ఇక అంతే కాకుండా అప్పట్లో జెమినీ టీవీలో టాప్ రేటింగ్ ను  సొంతం చేసుకుంది ఈ ప్రోగ్రాం.

ఇలాంటి చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే తన కెరీర్ ని మొదలు పెట్టిన అనితా చౌదరి, ఈటీవీ,జెమినీ టీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో యాంకర్ గా నటించింది. ఇక ఆ తర్వాత వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. సంతోషం, మురారి , ఉయ్యాలా జంపాలా వంటి మరి కొన్ని సినిమాలలో నటించింది అనిత. ఇలా బుల్లితెరపై, వెండితెర పై తనకంటూ ఒక స్థానాన్ని అలాగే గుర్తింపు కూడా  తెచ్చుకున్నది.

అంతే కాకుండా హీరో శ్రీకాంత్ తో తాళి అనే సినిమాలో నటించేందుకు ముందుగా ఈమెకు అవకాశం రావడం కూడా జరిగింది. కానీ ఇంటి నుండి 6 మాసాలపాటు  షూటింగ్ ఉంటుందని తెలపడంతో ఆమె అంగీకరించలేదు. అలా సినిమా అవకాశాన్ని వదులుకుంది అనిత. ఇక  ఒక ఎన్ ఆర్ ఐ ని పెళ్లి చేసుకుని, అటు ఫ్యామిలీతో, వెండితెరపై కూడా పలు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉంది.

ఇక ఈమె ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. అంతే కాకుండా ఈమె  ఒక చారిటీ సంస్థ ద్వారా ఎంతో మందికి చేయూత నిస్తుంది. ఇక తనకు నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయిన చేస్తానని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: