'జబర్దస్త్' వెనుకున్న నమ్మలేని నిజాలివే ?
ఇటీవల జబర్దస్త్ లో నటించే ఒక నటుడు ఈ షో గురించి సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.
* జబర్దస్త్ షో లో అన్ని టీం లీడర్ లను ఒకేలా చూడరని ఈయన చెప్పారు. ఈ ప్రోగ్రాం డైరెక్టర్ స్కిట్ లను సెలెక్ట్ చేయడానికి ముందుగా అందరి టీం లీడర్లను స్కిట్ ల గురించి అడుగుతారట, కొంతమందిని అయితే రిహార్షల్ చేసి చూపించమని చెబుతారట. అయితే కేవలం ఒక ముగ్గురి టీం లీడర్ లను మాత్రం కేవలం వారి స్కిట్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలట, ఓకే మీరిక స్కిట్ చేసేయండి అని చెబుతారట డైరెక్టర్. వారెవరో తెలుసా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మరియు చమ్మక్ చంద్ర. ఎందుకు డైరెక్టర్ ఆర్టిస్టుల మధ్యన బేధాలు చూపిస్తున్నారో ఎవ్వరికి తెలీదు.
* ఈ షో లో ముందుగా మాట్లాడిన ప్రకారం కాకుండా పేమెంట్ లలో తేడాలు ఉంటాయని కూడా తెలుస్తోంది. వారికి నచ్చిన ఆర్టిస్టులకు ఎంత పేమెంట్ అయినా ఇచ్చి షో లో ఉండేలా చేస్తారట.
* ఒక్కసారి ఈ షో లో చేయడానికి ఒప్పుకున్న తరువాత ఏ టీవీ ఛానల్ లో కానీ ఇతర కామెడీ షోలు చేయడానికి వీలులేదని తెలుస్తోంది.
* దీనికి జీ తెలుగు చానెల్ లో ప్రసారమయిన 'అదిరింది' షో తర్వాత, ఇక్కడ జబర్దస్త్ షో నిర్వాహకులు కూడా అగ్రిమెంట్ అని ఒక రూల్ పెట్టారట. ఇందులో చాలా కఠినమైన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్నీ తెలియకపోయినా ఏదైనా కారణాల వలన షో వదిలి వెళ్లాల్సి వస్తే అగ్రిమెంట్ ను మీరినందుకు 10 లక్షల రూపాయలు చెల్లించాలని ఒక నిబంధన ఉందని తెలుస్తోంది.
* గత సంవత్సరం జబర్దస్త్ నటుడయిన అవినాష్ కూడా బిగ్ బాస్ సీజన్ 4 లో నటించడానికి వెళ్లాల్సి వస్తే 10 లక్షలు పే చేశారని అతనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం తెలిసిందే.
* అదిరింది షో రాకముందు వరకు జబర్దస్త్ నటులంతా చాలా స్వేచ్ఛగా ఉండేవారిమని, కానీ ఆ తర్వాతనే నిబంధనలు అన్నీ వచ్చాయని సదరు నటుడు తన గోడును విన్నవించుకున్నాడు...