'బిగ్ బాస్' ఫస్ట్ డే మెగాస్టార్ ఎంట్రీ ?

VAMSI
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సీజన్ 1,2,3,4 లు ప్రేక్షకుల మన్ననలు పొంది సక్సెస్ సాధించగా, ఇక అందరి దృష్టి బిగ్ బాస్ సీజన్ 5 పై పడింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ మద్య పరిస్థితి కాస్త మెరుగు పడడంతో ఎట్టకేలకు ఈ షో త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది స్టార్ మా బృందం. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ సీజన్ 5 రాబోతుంది. అయితే మూడు నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జునే ఈసారి కూడా హోస్ట్ గా అలరించడానికి విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బిగ్ బాస్ సీజన్ 5 ఎంట్రీని గతంలో కన్నా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారట బిగ్ బాస్ టీం.

గతంలో సీజన్ ఎండింగ్ సమయంలో రిజల్ట్ తెలిపి ఫైనల్ విన్నర్ ఎవరో చెప్పేందుకు బిగ్ సెలబ్రిటీలను గెస్ట్ గా పిలిచేవాళ్ళు. అయితే ఈసారి సీజన్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి మెగా గిఫ్ట్ రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ లో గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు నాగ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ షోను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్త నిజమేనా బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ లో స్టేజ్ పై నాగ్ తో కలసి  మెగాస్టార్ కనిపిస్తారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు

అయితే దీనిపై అటు మా యాజమాన్యం కానీ చిరు కానీ క్లారిటీ ఇవ్వలేదు. కాగా సీజన్ 5 లో కంటెస్టెంట్ లు వీరే అంటూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి అవన్నీ నిజమా కదా అని తెలియాలన్నా కూడా మా యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: