టీవీ: యాంకర్ వర్షిణి మిస్సింగ్.. ఏమైందబ్బా ?
అయితే ఆమె ఈ షోలో కనిపించకుండా మాయం కావడంతో, ఆమె స్థానంలో మరొక యాంకర్ శ్రీముఖి ని తీసుకువచ్చారు. వర్షిని కామెడీ స్టార్ ప్రోగ్రాం నుంచి వెళ్లి పోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయ్ అని నెటిజన్లు సందేహ పడుతున్నారు. కొందరైతే బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అవ్వడంతో ఆమె ఈ షో నుంచి తప్పుకున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతానికి ఈమె కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది . అందుకోసమే ఆమె సినిమా షూటింగులలో ఉన్నదని మరికొంత మంది నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే ఆమె ఇప్పుడు గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి శాకుంతలం సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా మరొక హీరో అక్కినేని సుమంత్ తో కూడా ఒక సినిమాలో మెయిన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా సినిమాలలో బిజీగా ఉండడం చేత ఈమె షో నుంచి తప్పుకున్నట్లు ఎక్కువగా వినిపిస్తున్నది. ఇక అంతే కాకుండా ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల ఈమె బిగ్బాస్ కు వెళ్లే అవకాశం కూడా లేదని వార్త ఎక్కువగా వినిపిస్తుంది.
ప్రస్తుతానికి ఈమె చేస్తున్నటువంటి సినిమాలకు ఈమె డబ్బింగ్ చెబుతున్నది అనే విషయంగా కూడా ఎక్కువగా వినిపిస్తున్నది. కానీ అది ఏ సినిమా కోసం అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొంటుందా..? లేదా..? అనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.