టీవీ : బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కు ఛాన్స్ కొట్టేసిన ఆట సందీప్ దంపతులు .
ప్రస్తుతం లీక్ అయినటువంటి కంటెస్టెంట్ లిస్ట్ లోఆట సందీప్ భార్య జ్యోతి అనే పేరు కూడా బాగానే వినిపిస్తున్నాయి. అయితే లీక్ అయినటువంటి పేర్లలో.. చివరికి వచ్చేసరికి ఎంత మంది అందులో పాటిస్పేట్ చేస్తారో, కొత్తగా ఎంత మంది వస్తారో.. వేచి చూడాలి. ఇక హీరోయిన్ అయినటువంటి ఇషా చావ్లా కూడా తను బిగ్ బాస్ లో పాల్గొంటుందో.. లేదో.. కూడా క్లారిటీగా చెప్పేసింది. ఇక అయినా కూడా ఆమె పేరు ఎక్కువగా బయట వినిపిస్తూ ఉంది.
ఇక ఆట సందీప్ తన భార్య జ్యోతి కూడా బిగ్ బాస్ ఫైవ్ లోకి రాబోతున్నట్లు మొదట వినిపించినా. ప్రస్తుతానికి మాత్రం సందీప్ భార్య ఒక్కటే.. పాల్గొంటున్నట్లు సమాచారం ఎక్కువగా వినిపిస్తున్నది. ఇలాంటి సమయంలోనే ఆట సందీప్ తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ను పెట్టి వైరల్ చేశాడు.
అదేమిటంటే బిగ్ బాస్ షో కి సంబంధించి ఒక ఫోటోను పెట్టి.. అందులో లో "మేమిద్దరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు"అని ఒక ఫోటోను పెట్టి , సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక అందులో 83% వీరిద్దరూ బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు నెటిజన్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు నిజంగానే బిగ్ బాస్ షోలో పాల్గొంటారో.. లేదో.. వేచి చూడాల్సిందే.