టీవీ : తల్లిని ఫాలో అవుతున్న సుమా..?
ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న సుమ, ఇటీవల తన తల్లిని ఆ విషయంలో ఫాలో అవుతున్నానంటూ తెలిపింది. ఇటీవల తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చెబుతూ వస్తోంది. అంతే కాదు ఆమె తల్లి గారు చేసిన యోగాసనాలు గురించి కూడా ఒక వీడియో తీసి , సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తన తల్లి గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇంట్లో అంతా పండగ వాతావరణం నెలకొంది.
సాధారణంగా సుమ చిన్న వయసులో ఉన్నప్పుడు , తన పుట్టినరోజుకు సుమ వాళ్ళ అమ్మ సుమను గుడికి తీసుకువెళ్లి , ఆ తర్వాత ఎన్నో రకాల వంటలు వండి, సుమ ఫ్రెండ్స్ ని పిలిచి ఆతిథ్యం ఇచ్చేదట. అలా ఎన్నో సంవత్సరాల పాటు తన తల్లి తన పుట్టినరోజుకు చేసిన సంబరాలను , ఇప్పుడు సుమ తన అమ్మ తల్లి కోసం ఉదయాన్నే లేచి, ఎన్నో రకాల వంటలను కూడా తయారు చేసిందట. అంతే కాదు వాళ్ళ అమ్మగారిని గుడి కి తీసుకెళ్లి, ఆమె స్నేహితులను కూడా ఇంటికి పిలిచి భోజనం వడ్డించింది సుమా. ఇక ఈ హడావిడి అంతా ఒక వీడియో లో బంధించి ,సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.