టీవీ : ఈ ఏడాది సడన్ గా సీరియల్స్ నుంచి తప్పుకున్న స్టార్స్ వీళ్లే ..!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా బుల్లితెర హవానే కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా ప్రసారమయ్యే ఎటువంటి షో లు, పలు సీరియల కారణంగా ఎక్కువగా బుల్లితెర ని చూస్తూ ఉన్నారు మన ప్రేక్షకులు. అంతే కాకుండా వారికి ఎంతో అభిమానులుగా మారిపోతున్నారు. అలా ఈ మధ్య కాలంలో కొంత మంది బుల్లితెర నటులు అనుకోని కారణాల చేత ఆ సీరియల్స్ లో కనిపించక పోవడం జరిగింది. వారి వివరాలను చూద్దాం.

జీ తెలుగులో ప్రసారం అవుతున్న "అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు"నాటికలో ద్విపాత్రాభినయం చేస్తూ ఉన్నటువంటి"చైత్ర  రామ్"అనుకోని కారణాల చేత హఠాత్తుగా తప్పుకుంది. అందుకు కారణం తన సీరియల్స్ లో  బిజీగా ఉండటం చేత తన టైం ను కొంచెం కూడా తమ పర్సనల్ లైఫ్ కి వినియోగించుకో కపోవడంతో ఆమె సీరియల్స్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ఇక మరొక ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి నాటిక లో నటిస్తున్న" గౌతమి" అలియాస్ మధు రెడ్డి"ఇప్పుడు అనుకోని కారణాల చేత తప్పుకున్నారు. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే సీరియల్స్ లోని యూనిట్ సభ్యులతో కాస్త ఇబ్బందిగా ఉండటం చేతనే తప్పుకున్నట్లు సమాచారం.

ఇక మరొక ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి "హిట్లర్ గారి పెళ్ళాం"సీరియల్లో లో"కీర్తి ధనుష్"నటిస్తోంది. కానీ ఈమె ప్రెగ్నెంట్  కారణంగా ఈ నాటిక  నుంచి సడన్ గా తప్పుకున్నట్లు సమాచారం. కల్యాణ వైభోగం సీరియల్ లో కూడా నటిస్తున్న అటువంటి"సన్నీ" కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా ఆ సీరియల్స్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ఇక ఇక మరొక ఛానల్లో ప్రసారమయ్యే"కేరాఫ్ అనసూయ"అనే నాటికలో నటించిన హీరో"ప్రజ్వల రవి"కొన్ని రోజుల క్రితమే ఈ నాటిక నుంచి తప్పుకున్నాడు. ఈయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నందువలన, ఈయన కొద్దిరోజులు విరామం తీసుకున్న తర్వాత మరి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం..

ఇక వీరే కాకుండా మరికొంత మంది కూడా కొన్ని కారణాల చేత, కొన్ని ఇబ్బందుల చేత తప్పుకున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: