త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి అన్షురెడ్డి...
కరోనా కాలమ్‌లో అటు పెద్ద తెర నటులు వరుసగా రానా దగ్గుబాటి,నితిన్,నిహారిక,కాజల్ అగర్వాల్ ఇలాంటి స్టార్స్ ఎంతో మంది పెళ్లి పీటలు ఎక్కారు.ఈ మధ్యనే rx 100 హీరో కార్తికేయన్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.అదే బాటలో బుల్లి తెర నటి నటులు హారిక,ఎక్ నాద్ పెళ్లి చేసుకున్నారు.తరువాత నిన్నే పెళ్లాడుతా సీరియల్ ఫేమ్ ప్రతాప్,అనుష లు పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు.అలాగే త్రినయని సీరియల్ హీరో,హీరొయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
తాజాగా ఇద్దరు అమ్మాయిలు,కధలో రాజకుమారి,అష్టాచెమ్మ సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి అన్షురెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్‌గా ఉండే అన్షురెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అదేవిధంగా ఎంగేజేమేంట్ కి మెహంది పెట్టుకుంటూ రెడీ అవుతున్న పిక్ ని ఇన్స్త్రాగ్రం లో పోస్ట్ చేశారు.దీనితో ఈ విషయం ద్రువికరించారు.అంతేకాకుండా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎమోజిని పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్య పడేలా చేసింది.
అన్షురెడ్డి పెల్లిచేసుకోబోతున్న వ్యక్తి పేరు సౌమిత్ రెడ్డి అని,అతడు టెక్సాస్ లోని డెల్లాస్‌లో ఉంటాడని విషయం తెలుస్తుంది.ఈ విషయాన్ని అన్షురెడ్డి ఆఫీషియల్ గా ద్రువికరించలేదు.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరోవైపు అన్షురెడ్డి అన్నయ్య వినయ్ కూడా తను రాఖి ఫొటోస్ ను షేర్ చేసి తర్వాత సంవత్సరం నుండి ఆన్లైన్లో నే రాఖి కడతావు అని పోస్ట్ చేసారు.నెక్స్ట్ ఇయర్ నువ్వు నా దగ్గర ఉండవుగా అని అందరని ఆలోచనలో పడేశారు. అన్షురెడ్డి పెల్లి చేసుకోబోతున్నవిషయం తను ద్రువికరిస్తే బాగుంటుంది అని అందరు అంటున్నారు. అన్షురెడ్డి అక్క అమూల్య కూడా సీరియల్ ఆక్టర్ అన్న విషయం తెల్సిందే.తను ఇప్పుడు పెళ్లి చేసుకొని అమెరికాలో ఉంది.తన అక్క ఈ ఫంక్షన్‌కి రాలేకపోయింది.దానితో అన్షురెడ్డి ఎమోషనల్ అయ్యారు.బుల్లితెర నటులు ఈ ఫొటోస్‌ని షేర్ చేసి అన్షురెడ్డికి సోషల్ మీడియావేదికగా విషెస్ చెబుతున్నారు