
వారి వల్లే ఈ స్టేజ్లో ఉన్నానంటూ బిగ్ బాస్ షో లో ఎమోషనల్ అయినా లోబో..!!
లోబో ఎంట్రీ ఇవ్వక ముందు బిగ్ బాస్ వాళ్ళు తన జీవిత చరిత్రను కూడా షూట్ చేయడం జరిగింది..ఈ వీడియో లో లోబో మొదట చాలా విచ్చలవిడిగా తిరిగే వాడట ..కేవలం పెళ్లయిన తర్వాత తన భార్య కారణంగా తను పూర్తిగా మారిపోయాడు అని తెలిపాడు.. తన భార్య లేకపోతే ఏమైపోయే ఉండేవాడినో అంటూ కూడా ఎమోషనల్ అయ్యాడు లోబో.. తనకు బాబు పుట్టి ఉంటే మారక పోయేవాడినని, పాప పుట్టింది కాబట్టి మారాను అని చెప్పాడు..
ఇక దాదాపుగా 2009 నుంచి 2013 వరకు మా టీవీ ఆఫీస్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా అని, 2013 సెప్టెంబర్ నెలలో ఎట్టకేలకు తనకు మా టీవీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చిందని, అదే తన జీవితంలో మర్చిపోలేని రోజు అని తెలిపాడు.. ఇక ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్న తర్వాతనే ,ఈ స్థానంలో ఉన్నానని తెలిపాడు. ఎంతో సంతోషంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లోబోను మిగతా హౌస్ మేట్స్ గ్రాండ్ గా ఆహ్వానించారు.