టీవీ : ఈ వారం ఓటీటీ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!
1. నాని నటించిన టక్ జగదీష్:
ఈ సినిమా నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయాలని కొద్దిరోజులు అనుకుంటే, చివరికి ఫైనల్ గా ఓటీటీ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అలా సెప్టెంబర్ 10వ తేదీన అమెజాన్ లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ , అలాగే కౌసల్య కృష్ణమూర్తి ఫేమ్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
2. అవికా గోర్ నటిస్తున్న నెట్:
అవికా గోర్ అలాగే రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం సెప్టెంబర్ 10వ తేదీన జీ ఫైవ్ లో ప్రసారం కానుంది. ముఖ్యంగా ఇంటర్ నెట్ ఉపయోగం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి అనేదే ఈ సినిమా కథాంశం..
ఇక వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10వ తేదీన ముంబై డైరీస్ అలాగే లాలూ రిచ్ లు విడుదల కాబోతున్నాయి.
ఇక ఆహలో ద బేకర్ అండ్ ద బ్యూటీ, మహాగణేశ వంటి వెబ్ సిరీస్ లో ప్రసారం కానున్నాయి.
డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అమెరికన్ క్రైమ్ స్టోరీ సీరీస్ ప్రసారం కానున్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో
సెప్టెంబర్ 7వ తేదీన అన్ టోల్డ్ బ్రేకింగ్ పాయింట్
సెప్టెంబర్ 8వ తేదీన ఇన్ టు ది నైట్
సెప్టెంబర్ 9వ తేదీన బ్లడ్ బ్రదర్స్
సెప్టెంబర్ 10వ తేదీన మెంటల్ షాప్ మాస్టర్స్, కేట్ వంటివి ప్రసారం కానున్నాయి.
ఇక జి ఫైవ్ లో సెప్టెంబర్ 15వ తేదీన డిక్కీలూనా, క్యా మేరీ సోనమ్, గుప్తా బేవఫా హై ప్రసారం కాబోతున్నాయి. ఇక ఇవన్నీ చూస్తుంటే ఈ వారం ప్రేక్షకులకు విందు భోజనమే అనిపిస్తోంది.