బిగ్ బాస్ 5: నీ బట్టలు చించుతా అని ఫైర్ అయిన ఉమాదేవి... ఇవేం మాటలు ?
ఒకర్ని మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ చేస్తున్నారు. శ్వేత వర్మ అయితే చిన్న విషయానికే అరచి గగ్గోలు పెడుతూ ఎదుటి వారిపై విరుచుకుపడుతున్న విధానం ఆస్కార్ అవార్డ్ కోసమో ఏమో గానీ పర్ఫామెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటోంది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా గేమ్ ను ఆమె కసిగా, ఎదుటి వారిని మసి చేసైనా గెలవాల్సిందే అని ఆడిన విధానం చూస్తే వామ్మో ఇది ఒలంపిక్స్ ఏమో అన్న అనుమానం ప్రేక్షకుడికి వచ్చిందంటే నమ్మండి. ఇక సిరి అయితే ఈ టాస్క్ గెలవకపోతే హౌస్ నుండి ఇప్పుడే ఎలిమినేట్ అవుతాం అన్న రేంజ్ లో పరుగులు తీస్తోంది. ఇక ఉమాదేవి సిరి వద్ద నుండి పిల్లోస్ లాక్కొనే సమయంలో కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొడుతున్నారు అంటూ అరచి గందరగోళం చేసింది.
ప్రియ సిరిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. మరో వైపు ఉమాదేవి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు నేను పిల్లోని లాక్కున్నాను అంతే ఎవరి పైన దాడి చేయలేదంటూ గొడవకు దిగారు. కానీ యానీ మాస్టర్ నూ నీ టీ షర్ట్ చించి అయినా పిల్లౌస్ తీసుకుంటాను అన్న మాటలు చాల దారుణంగా ఉన్నాయి. ఒక సాటి మహిళా అనాల్సిన మాటలు అవేనా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హౌస్ లో ఉమాదేవి ఆగడాలు రోజు రోజుకీ మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇంతలో హౌస్ లో అది టాస్క్ అయినా సరే హింసకు తావు లేదంటూ ఇంటి సభ్యులను ని కూల్ చేసి ఎవరి టీమ్ ప్లేస్ లోకి వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశించారు.