బిగ్ బాస్ 5: హౌస్ లో "గుంట నక్క" ఎవరో తెలిసిందా ?

VAMSI
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో రగడ ఓ రేంజ్ లో జరిగింది. ముఖ్యంగా ప్రియ మరియు లహరి ల.మధ్య జరిగిన ఒక సంభాషణ ఏ మాత్రం ఆరోగ్యకరంగా లేదనే భావన ప్రేక్షకులలో కలిగి ఉంటుంది. ఒక జాతీయ టీవీ ఛానల్ లో వస్తున్న షో లో కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తుండగా ఒక మహిళ ఇంకో మహిళను అలా మాట్లాడటం సమాజం ఆహ్వానించదగినది కాదు. పైగా ఈ చర్చను అంతటితో ఆపకుండా కొనసాగిస్తూ వెళ్ళడం ప్రేక్షకుల్లో మరింత చర్చకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి.  రవి మరియు లహరి లకు లింక్ పెడుతూ ప్రియ అన్న మాటలు హౌస్ లో ఉన్న అందరినీ ఎంతగానో బాధ పట్టాయి. అక్కడ స్పష్టంగా జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రియ హైలైట్ చేయడం బాగాలేదు.
మొదటి రోజు నుండి ప్రియ హౌస్ లో అందరితో బాగా ఉన్నట్టు నటిస్తోందని రాత్రి జరిగిన ఎపిసోడ్ లో క్లియర్ గా అర్థమయింది.  అంటే కాకుండా తనను ఎవరైనా నామినేట్ చేసినా, అపోజ్ చేసినా వారిని సేఫ్ గేమ్ అంటూ హేళనగా మాట్లాడడం ఆమె స్థాయిని ఎంత దిగజర్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  హౌస్ లోని సభ్యులంతా ప్రియను పెద్ద వారని ఎంతగానో గౌరవించారు. కానీ ఆ స్థానాన్ని ప్రియ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. రాత్రి ప్రియ చేసిన వాదనను వింటే కొద్ది రోజుల క్రితం నటరాజ్ మాస్టర్ గుంట నక్క ఒకరున్నారు హౌస్ లో అన్న మాటకు సమాధానం దొరికినట్లయింది. ప్రియ మహిళలు అందరినీ తన చేతుల్లో పెట్టుకుని ఆట ఆడేలా ప్లాన్ చేసుకున్నారు క్లియర్ గా తెలుస్తోంది.

అందుకే లహరి తనతో సరిగా ఉండడం లేదని నామినేషన్ లో టార్గెట్ చేసి నానా రభస చేసింది. శనివారమే నాగార్జున హౌస్ లోనరోడర్ తప్పిందని సెట్ చేశారు. కానీ ఒక్క రోజులోనే మళ్లీ ఆర్డర్ తప్పింది. ఈ ఒక్క ఎపిసోడ్ తో హౌస్ లోని చాలా మంది ప్రియకు వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంది. ఇది ఆమెకు ముందు ముందు మరిన్ని కష్టాలను తెస్తుంది. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: