బిగ్ బాస్ 5: ఇంటిలో దొంగ... ఎవరో తెలిసిందా?

VAMSI
ఎప్పటిలాగే నిన్నటి ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల కోలాహలం మొదలైంది. కెప్టెన్సీ టాస్క్ ను మొదలెట్టారు బిగ్ బాస్. రాజ్యానికి రాజు అయ్యేది ఎవరు గెలిచేది ఎవరు..?? అనే టాస్క్ ను  ఇచ్చారు.  ఈ టాస్క్‌లో సన్ని మరియు రవి లను రాజ కుమారులుగా నియమించి మిగిలిన ఇంటి సభ్యులను  సన్నీ ప్రజా.. రవి ప్రజా అంటూ  రెండు జట్లుగా విడదీశారు. ఈ టాస్క్‌ లో భాగంగా యాంకర్  రవి రాజ కుమారుడి గెటప్ లో అదరగొట్టాడు. అటు సన్ని కూడా రాజ కుమారుడిగా తన రాజసాన్ని చూపించాడు. రవిని కండలు తిరిగిన విశ్వ తన భుజాలపై ఎత్తుకోవడం ప్రోమోలో కనిపించింది. అయితే అదేమైనా టాస్క్ నా లేక విశ్వ రవి కి సపోర్ట్ చేయడం కోసం అలా చేస్తున్నాడా అన్నది చూడాలి. అలాగే విశ్వ మరియు మానస్ లు వారి రాజ కుమారుల తరపున కుస్తీ పోటీలో పాల్గొననున్నట్లు ప్రోమో లో కనిపించింది. అది కూడా ఆ కుస్తీ పోటీ బురదలో నిర్వహించడం విశేషం.

మరి ఆ కుస్తీ పోటీలో ఎవరు గెలిచారు ఎంత రసవత్తరంగా ఆ పోటీ నడిచింది అనే విషయం రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది. పోటీ సమయంలో విశ్వ మానస కు మధ్య చిన్న గొడవ కూడా తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే అది ఎంత పెద్ద గొడవ లేక ఒకటి రెండు మాటలతో ఆగిపోయిందా అన్నది కూడా రేపటి ఎపిసోడ్ లోనే చూడాలి. ఇక.. టాస్క్‌ మొదలయ్యే ముందు బిగ్ బాస్ ఇరు జట్లకు కూడా సమానంగా  కొన్ని నాణేలు ఇచ్చి చివరికి ఎవరి వద్ద నాణేలు ఎక్కువ ఉంటే వారు గెలిచినట్లు అని చెప్పారు. అయితే కుస్తీ పోటీ జరుగుతున్న సమయంలో జెస్సీ, షణ్ముఖ్ ,  సిరిలు పెట్టెలో ఉన్న నాణేలను దొంగతనం చేసినట్లు ప్రోమోలో కనిపించగా... ఈ విషయంపై  విశ్వ నిప్పులుచెరిగాడు. ఇలా దొంగ బుద్ధి చూపించడం కాదు దమ్ముంటే ముందుకొచ్చి ఆడండి. అంటూ తన కోపాన్ని చూపించాడు.

మరి నాణేలు దొంగతనం చేసిన వారెవరో ఈ రోజు ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ టాస్క్ ఎన్ని నవ్వులు పూయిస్తుందో, మరెన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా రేపు ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ గా ఉండబోతోంది అని అర్దం అవుతోంది. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ లో రవి గెలుస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. ఆ లెక్కన కాబోయే బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ రవి నేనా కాదా అన్నది రేపటి ఎపిసోడ్ లో క్లియర్ గా తెలియ నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: