టీవీ: చెల్లెలి కాపురం సీరియల్ మానస రియల్ లైఫ్ స్టోరీ..!!
ఇకపోతే మానస అసలు పేరు సింధుజ.. ఈమె మార్చి 15వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. మానస కు ఒక చెల్లెలు , ఒక బ్రదర్ కూడా ఉన్నారు.. ఇక ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం విషయానికొస్తే , ఈమె వివేకానందలో పూర్తి చేసింది. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే , జ్ఞానదీప్ కాలేజీలో తన చదువును పూర్తి చేసింది. ఇకపోతే సింధుజకు కూడా చిన్నప్పటినుంచి నటన అంటే ఎనలేని ఇష్టం.. ఇక దాంతో ఆమె స్కూల్ అలాగే కాలేజీ యాక్టివిటీస్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొనడం తో పాటు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది..
ఇక చదువు పూర్తయ్యాక యాక్టింగ్ లో తన కెరియర్ ను మొదలు పెట్టింది. మొదటిసారి స్నేహితుల ప్రోత్సాహం తో ప్రముఖ జెమిని టీవీ ఛానల్ లో ప్రసారం అయిన శ్రావణ సమీరాలు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇక మొదటి సీరియల్ తోనే మెప్పించిన సింధూజ ఆ తర్వాత అగ్నిపూలు,పక్కింటి అబ్బాయి, సరదాగా కాసేపు, కల్యాణ వైభోగం , రోజా, బంధం, ముత్యాల ముగ్గు, అక్క మొగుడు , అత్తారింటికి దారేది వంటి పలు సీరియల్స్ లో నటించింది. ఇక ప్రస్తుతం చెల్లెలి కాపురం సీరియల్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది.