బిగ్ బాస్ 5: షన్నుపై దీప్తి సునైనా అలక? కారణమిదేనా?
అలాగే ఇవన్నీ జస్ట్ వారి క్రేజ్ ను పెంచుకోవడం కోసమే తప్పని నిజం కాదని కొట్టి పారేసిన వారు ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఇపుడు నడుస్తున్న సీజన్ 5 లో మొదటి నుండి శ్రీ రామ్ - హమీద్ మరియు షణ్ముఖ్ జస్వంత్ - సిరి లు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండగా హమీదా ఎలిమినేట్ అవ్వడంతో శ్రీరామ్ ఒంటరై పోయాడు. ఇక సిరి, షన్ను లు మాత్రం రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేక్షకులకు షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకే బెడ్ పై గుసగుసలు, ఒకరి కోసం మరొకరు సపోర్ట్ చేసుకోవడం. ఇక ఇపుడేమో తాజాగా సిరిని హగ్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు షన్ను. తనకు సారి చెప్పమని షన్నును సిరి అడుగగా తనకి డైరెక్ట్ గా హగ్ ఇచ్చాడు షన్ను. ఇదేంటి అని అడిగితే నేను చెప్పే సారి ఇలాగే ఉంటుందని చెప్పి మరోసారి హగ్ ఇచ్చాడు షన్ను.
అయితే ఈ ఎపిసోడ్ చూసిన దీప్తి సునయన ఫుల్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరితో క్లోజ్నెస్ ఎక్కువ అవడంతో కారాలు మిరియాలు నూరుతున్న ఈ బ్యూటీకి ఈ హగ్ సీన్ మరింత ఆగ్రహం తెప్పించిందని, జస్వంత్ కి తనకి కామన్ ఫ్రెండ్స్ అయిన కొందరితో ఈ విషయం పై మాట్లాడుతూ ఎమోషనల్ అయిందని అంటున్నారు. మరి ఇందులో ఫాక్ట్ ఎంతవరకు ఉందో తెలియదు గానీ...ఒకవేళ ఇదే కనుక నిజమైతే షన్ను హౌస్ నుండి బయటకు వచ్చాక... దీప్తి డైలాగ్ మాత్రం అరె ఏంట్రా ఇది...!! అనే అంటున్నారు నెటిజన్స్.