టీవీ: త్రినయని సీరియల్ జాస్మిన్ రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ప్రముఖ జీ టీవీ ఛానల్ లో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఎన్నో సీరియల్స్ లో త్రినయని సీరియల్ కూడా ఒకటి..ఈ సీరియల్ ఈ మధ్య మిగతా సీరియల్స్ ను వెనక్కినెట్టి టిఆర్పి రేటింగ్ మంచిగా సాధిస్తోంది.. ఇక ఈ సీరియల్ మొదట్లో ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ ప్రదీప్ కూడా రావడం గమనార్హం.. ప్రదీప్ మాత్రమే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొని ఈ సీరియల్ కు హైలెట్ గా నిలిచారు..

ఈ సీరియల్ లో త్రినయని పాజిటివ్ రోల్ పోషిస్తుండగా, జాస్మిన్ నెగటివ్ పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటోంది. ఇకపోతే జాస్మిన్ లైఫ్ స్టోరీ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం.. జాస్మిన్ అసలు పేరు ప్రియాంక చౌదరి.. త్రినయని సీరియల్ లో నటిస్తున్న జాస్మిన్ గా నటిస్తూ వుండగా.. అందరూ జాస్మిన్, ప్రియా అనే ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈమె మన తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.. 1994 వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన విజయవాడలో జన్మించిన ప్రియాంక చౌదరి కి 27 సంవత్సరాలు పూర్తవుతాయి.

చిన్నప్పట్నుంచి నటన మీద మక్కువ ఎక్కువ ఉండటం.. పైగా సినిమాలు ఎక్కువగా చూసి  మరింత ఆసక్తిని పెంచుకుంది.. విజయవాడలో ఉన్న కృష్ణవేణి స్కూల్లో చదువుకునే సమయంలోనే ఈమె ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో  కూడా చాలా చురుగ్గా పాల్గొనేది. బి బి ఏ పూర్తి చేసిన ప్రియాంకను ఆమె తోటి స్నేహితులంతా చూడడానికి చాలా అందంగా ఉంటావు కదా.. సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారట.. ఇక దాంతో ఇంట్లో వాళ్ళని ఒప్పించి సినిమాలో ఛాన్స్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది..

అలా మొదటిసారి ఆడిషన్స్ కి వెళ్లి శివకాశీపురం, మా ఊరిలో నా ప్రేమకథ, సరోవరం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అభిషేకం సీరియల్ ద్వారా ఈటీవీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ,  త్రినయని సీరియల్ లో నెగెటివ్ షేడ్స్ లో నటిస్తూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ఇక ఈమె ఆస్తి ఐదు కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాదులో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో నివసిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: