టీవీ: చెల్లెలి కాపురం నుంచి నీలాంబరి ఎందుకు తప్పుకున్నారు తెలుసా..?
ఇకపోతే నీలంబరి అసలు పేరు మాధురి అని తెలిసిన విషయమే.. చెల్లెలి కాపురం సీరియల్ లో పౌర్ణమికి తల్లి క్యారెక్టర్ లో నీలాంబరి పాత్రలో మాధురి నటిస్తోంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి.. చెల్లెలి కాపురం నీలాంబరి గా గుర్తింపు తెచ్చుకుంది.. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈమె చెల్లెలి కాపురం సీరియల్ లో కనిపించడం లేదు. ఎందుకు ఈ సీరియల్ నుంచి తప్పుకుంది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. చెల్లెలి కాపురం సీరియల్ లో మాధురికి నటించడం ఇష్టం లేకనే ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంది అనే వార్తలు కూడా రావడంతో ఒకపక్క నెటిజెన్స్ షాక్ అవ్వడమే కాకుండా ఆమె అభిమానులు కూడా నిరుత్సాహ పడుతున్నారు..
అయితే ఆమె నిజంగా ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణం వేరే ఉందట.. మాధురి ఒక బేబీ బొమ్మ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె తల్లి కాబోతోందని విషయం స్పష్టమవుతోంది.. మాధురి తల్లి కాబోతోంది కాబట్టి తను సీరియల్ కి దూరం అయిందని సమాచారం.. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు బెస్ట్ విషెస్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక చంటి బంగారు పాపాయి కి జన్మనివ్వబోతున్న మాధురి కి అందరూ శుభాభినందనలు తెలుపుతున్నారు.