టీవీ: అత్తారింటికి దారేది సీరియల్ రక్షిత రియల్ లైఫ్ స్టోరీ..!

Divya
కరోనా మహమ్మారి ఎప్పుడైతే వచ్చిందో ..అప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఖాళీగా కూర్చోలేక టీవీలకు అతుక్కు పోవడం జరిగింది. ఇక టీవీలో ప్రసారమవుతున్న ధారావాహికలకు టిఆర్పి రేటింగ్ పెరిగిపోవడానికి కారణం కరోనా ని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా వల్ల ఎవరు బయటికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు టీవీ సీరియల్ చూస్తూ కాలక్షేపం చేశారు. సీరియల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్ అత్తారింటికి దారేది. ఈ సీరియల్ ద్వారా ఎంతోమంది నటీనటులు తమ ఇమేజ్ ను మరింత పెంచేసుకున్నారు. అలాంటి వారిలో ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది రక్షిత. ఈ సీరియల్ లో ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ కూతురుగా మనకు పరిచయం అయింది. ఈమె గురించి..ఈమె రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..


రక్షిత అసలు పేరు మంజీరా. నవంబర్ 8వ తేదీన జన్మించిన ఈమెకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి అట. అంతేకాదు స్కూల్ నుంచి రాగానే తప్పకుండా సినిమాలు చూడాల్సిందే. అలా స్కూల్ లో చదువుతున్న సమయం నుంచి మంజీరా సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. ఆ ఆసక్తి కాస్త తను కూడా నటించాలనే ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన పెరిగి పెద్దయిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టేలా చేసింది. తన చదువు పూర్తి చేసుకుని మొదట షార్ట్ ఫిలిమ్స్ లోకి అడుగుపెట్టింది మంజీరా. తరువాత కొన్ని సినిమాలలో కూడా నటించింది. మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన రక్షిత ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంజీరా తనకు ఇష్టమైన డాన్స్ చేస్తూ , ఖాళీ సమయాలలో టిక్ టాక్ వీడియోస్ చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉండేది. ప్రస్తుతం అత్తారింటికి దారేది సీరియల్ లో వర్మ కూతురు గా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది రక్షిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: