బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

VAMSI
ఈ వారం ఎవరూ ఊహించని విధంగా హౌజ్ నుండి కండల వీరుడు విశ్వ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ అనుకున్న విశ్వ ఎలిమినేట్ అవడంతో హౌస్ మేట్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. విశ్వ ఇంటి నుండి వెళ్ళిపోగానే బిగ్ బాస్ హౌస్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఇంటి సభ్యుడు..అదేంటి విశ్వ చాలా స్ట్రాంగ్..తన గేమ్ తాను పక్కగా ఆడుతారు. మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు..ఇక ఈ లెక్కన ఎవరు ఎపుడు ఎలిమినేట్ అవుతారో అస్సలు కనీసం ఊహించడం కూడా కష్టమే అంటూ అంతా వాపోయారు. ఈ రోజు కూడా బిగ్ బాస్ హౌజ్ లో దాదాపు ఇదే డిస్కషన్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఇక నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని ప్రముఖ మీడియాలు అందిస్తున్న సమాచారం మేరకు ఇక వరుసగా మేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవనున్నారని అంటున్నారు. అందులో తదుపరి ఎలిమినేషన్ లో ఇంటి నుండి బయటకు వెళ్లబోయే ఇంటి సభ్యుడు జెస్సీనే అంటూ న్యూస్ లీకైనట్లు తెలుస్తోంది. మొదట్లో చాలా కామ్ గా అసలు హౌజ్ లో ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉండే జెస్సీ ఈ మధ్య గేమ్ ఆడటం కాస్త మొదలుపెట్టాడు. దానికంటే కూడా సంఛాలక్ గా ఎక్కువగా చేస్తూ ప్రేక్షకుల కంట్లో బాగానే పడ్డాడు. సన్నితో గొడవ ఇలా కొన్ని సందర్భాల్లో కాస్త సింపతీ కూడా కూడగట్టుకున్న జెస్సీ ఈ వారం ఎలిమినేట్ అవనున్నాడు అని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ మాత్రమే, ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకో మూడు రోజులు గడిస్తే ఈ న్యూస్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుతుండటంతో టాస్క్ లు, గేమ్ లను మరింత ఉత్కంఠ బరితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక దిన దిన గండమే ఇంటి సభ్యులకు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: