బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

VAMSI
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అపుడే 10 వారాలు దాటేసింది. నిన్న, మొన్న మొదలైనట్టు ఉన్న ఈ షో సగం కి పైనే అయిపోయింది అంటే కాస్త ఆశ్చర్యం గానే ఉంది. ఏదేమైనా టెలివిజన్ షో లలో అత్యధిక మెజారిటీ పొందిన షోగా గుర్తింపు పొంది జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈ రియాలిటీ షో విన్నర్ ఎవరవుతారా..?? సీజన్ ఫైవ్ టైటిల్ ను ఎవరు పట్టుకెలతారా అని తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇంటిసభ్యుల ఆటను బట్టి ప్రేక్షక అభిమానులు కంటెస్టెంట్స్ పై అభిమానాన్ని పెంచుకుంటూ వారే గెలవాలని కోరుకుంటున్నారు. నిజానికి రోజు రోజుకు అంచనాలు మారుతూనే ఉన్నాయి.

ఒకరిని మించి ఒకరు పోటీ పడటం, కొన్నిసార్లు సింపతీ వలన, ఇంకొన్నిసార్లు టాస్క్ ల్లో బకరాలు అవడం, మరికొన్నిసార్లు అధ్బుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం వలన ఇలా రకరకాలుగా తెలుగు బిగ్ బాస్ ఇంటి సభ్యులపైన ప్రేక్షకుల ఒపీనియన్స్ మారుతున్నాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం టాప్ ఫైవ్ లిస్ట్ లో శ్రీ రామ్ చంద్ర, రవి, సన్ని, అనీ మాస్టర్, మానస్ పేర్లు వినిపిస్తూ ఉండగా...ఇపుడా లిస్ట్ లో మానస్ పేరు బదులుగా షణ్ముఖ్ జశ్వంత్ పేరు వినిపిస్తోంది. అవును వారం నుండి షణ్ముఖ్ తన గేమ్ ప్లాన్ ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇంతకు ముందులా సైలెంట్ గా అస్సలు లేడు. గేమ్స్ లో చురుగ్గా పాల్గోవడమే కాదు మిగిలిన ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

మనసులో ఏమనిపిస్తే అది ముఖం పైనే చెప్పేస్తున్నాడు. అయితే అతడిలో వచ్చిన ఈ మార్పే చాలా మంది ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. దాంతో షన్నుకి ఇపుడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. రానున్న రోజుల్లో ఏ ప్లేస్ లో ఉంటారన్నది అతడి గేమ్ పైనే ఆధారపడి ఉంది. ఇక మానస్ విషయానికొస్తే గేమ్స్ లో పెద్దగా పార్టిసిపెంట్ చేయకపోయినా అతడి మాటలు, నిదానం వంటివి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను ఆకర్షించేవి. అలాంటిది ఈ వారం ఆ మ్యాజిక్ ఎందుకో మిస్ అయ్యిందని చాలా మంది ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో అతడి ప్లేస్ కాస్త షన్ను తన బెటర్ పర్ఫార్మెన్స్ తో కబ్జా చేసేశారు అనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: