బిగ్ బాస్ 5: సైలెంట్ కిల్లర్ రవి కాదట... మరి ఎవరో తెలుసా?
అలా ఒక్కొక్కరితో మాట్లాడుతున్న జెస్సీ , సిరి తో మాట్లాడుతూ ఏంటి మాటలేనా ముద్దు పెట్టవా అంటూ షాక్ ఇచ్చాడు...అటువైపు సిరి ఏమో అందరూ ఉన్నారు రా అంటూ తెగ సిగ్గుపడింది. ఈ సీన్ చూసిన ప్రేక్షకులకు మాత్రం ఏంటీ కర్మ ఇదేం పని రా బాబు అనిపించింది. సిరి అలా అంటూనే ఫోన్లో జెస్సికి ముద్దిచ్చింది. ఇక ఇంకేముంది ఇటు వైపు జెస్సీ కూడా ఇచ్చి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. సిరి ఐలవ్ యూ జెస్సి అంటూ మళ్ళీ ఓ ముద్దు పడేసింది. అలా సిరి, జెస్సీ ఇద్దరు కలసి మన్మధుడు నాగ్ సార్ ముందే సరసాలు అడేసారు. ప్రేక్షకులందరూ చూస్తుండగానే...వీరు ఇలా మాట్లాడుకోవడం చాలా మందికి ఇబ్బందికరంగా అనిపించింది.
ఇదిలా ఉండగా బయటకు వెళ్ళగానే జెస్సీకి ఇంటి నుండి ఫోన్ వచ్చిందంట మొదట ఆరోగ్యం గురించి అడిగి నెమ్మదిగా తెలుసుకుని....ఆ తర్వాత ఆగలేక సిరి ని ముద్దు అడిగిన విషయం గురించి కూడా అడిగేసారట..!!
ఇప్పటి దాకా సక్కగా ఆడి..గిప్పుడు గిట్లా చేసి ఇజ్జత్తు తీసినవ్ ఏంద్రా అంటూ కోప్పడినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జెస్సీ మాత్రం వెళ్తూ వెళ్తూ బాగా హైలెట్ అయ్యి వెళ్ళాడు. మానస్ ను పట్టుకుని నువ్వు రవి కి పెదనాన్న...సైలెంట్ కిల్లర్ అంటూ బాగానే టార్గెట్ చేసి మాట్లాడాడు.