బిగ్ బాస్ 5: "షణ్ముఖ్ - సిరి" ల మధ్య రిలేషన్ ఏమిటో తెలుసా?

VAMSI
బిగ్ బాస్ తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ టి ఆర్ పి తో టెలికాస్ట్ అవుతున్న రియాలిటీ షో. ఈ షో మొదలై ౧౧ వారాలు అవుతోంది. ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ప్రేక్షకులకు ధీటైన సంతోషాన్ని అందిస్తోంది. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో కొన్ని సన్నివేశాలు ఇద్దరు ఇంటి సబహ్యులను వేలెత్తి చూపించేలా ఉన్నాయి. అంతే కాకుండా ఇటువంటి సన్నివేశాలు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది మహిళలు చూడలేని పరిస్థితి. ఇంతకు ముందే ఈ షో పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా షో నిర్వాహకులు తమకు ఇష్టం వచ్చినట్లుగా డైరెక్ట్ చేస్తున్నారు. కాగా నిన్న షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి హన్మంత్ ల మధ్య జరిగిన బాత్ రూమ్ సన్నివేశం అందరికీ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది అని చెప్పాలి.
ఇద్దరూ కూడా బిగ్ బాస్ గేమ్ షో లో కంటెస్టెంట్ లుగానే ఉన్నారు. అయితే వీరిద్దరూ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తమ వ్యక్తిగత విషయాలపైన ద్రుష్టి సారించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇదే విషయాన్నీ స్వయంగా షణ్ముఖ్ శ్రీరామచంద్ర తో చర్చించాడు. శ్రీరామ్ కూడా షణ్ముఖ్ ను టైటిల్ కోసం ఆడు బ్రదర్ అంటూ మోటివేట్ చేశాడు. కానీ ఎందుకో షణ్ముఖ్ సిరి ల మధ్య సాగుతున్న రిలేషన్ సరిగా లేదు అని తెలుస్తోంది. వీరిద్దరూ స్నేహితులం అని చెప్పుకుంటున్నా వీరు చేసే పనులు అలా ఉండడం లేదు. రోజుకు చాలా సార్లు డీప్ హాగ్ లు ఇచ్చుకోవడం, సిరి షణ్ముఖ్ ను కిస్ చేయడం, ఇద్దరూ ఎమోషనల్ అయిపోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
ఇద్దరూ కూడా బయట వేరే వ్యక్తులతో రిలేషన్ లో ఉన్నారు. మరి ఇదేమి వ్యవహారం అనేది వారే ఆలోచించుకోవాలి? బయట తమను ఇష్టపడే ప్రేక్షకులు వీరిని ఏ విధంగా తీసుకుంటారు అనే విషయం కూడా వీరిద్దరూ ఆలోచించకుండా ప్రవర్తించడం ఏమంటారో బిగ్ బాస్ చెప్పాలి? ఇది ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: