కొత్త సీరియల్ కోసం "కార్తీక దీపం" ను ముగిస్తున్నారా?

VAMSI
స్టార్ మా లో కొత్త సీరియల్ రాబోతుంది. గత రెండు మూడు రోజుల నుండి ఈ సీరియల్ ప్రోమోని చూపిస్తున్నారు. ఇందులో సైకిల్ పోటీలు జరుగుతుండగా, గీత ఎక్కడ గీత ఎక్కడ అంటుండగా... ఓ 60 ఏళ్లు పైబడిన ఆవిడ సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇస్తుంది. పక్కన వారు గీత అంటే పడుచుపిల్ల అనుకున్నాము. అరవై ఏళ్ల ముసలావిడ అంటారు. అపుడు గీత నేను జస్ట్ స్వీట్ 25 అంతే అంటుంది. ఇంతకీ ఆ గీత పాత్రలో ఉన్నది మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నటి అయిన ప్రభా. సీరియల్ టైటిల్ ఏంటన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ ప్రోమోని మాత్రం బాగా హైలెట్ చేస్తున్నారు. త్వరలో ఈ సీరియల్ స్టార్ మా టివి ప్రేక్షకుల కనుల ముందుకు రానుంది.

ఇదంతా సరే ఈ సీరియల్ రావాలంటే స్లాట్ ఉండాలి లేదా ఏదైనా సీరియల్ శుభం కార్డు వేసుకుంటే ఆ స్లాట్ కాస్త ఈ కొత్త సీరియల్ తీసుకోవచ్చు. స్టార్ మా లో స్లాట్ అయితే  కష్టమే సీరియస్ ప్రోగ్రామ్స్ తో ఫుల్ బిజీ షెడ్యుల్ తో ఉంది స్టార్ మా ఛానల్. అయితే ఇక ఏదైనా సీరియల్ కి శుభం పలకాల్సిందే. అలా చూస్తే స్టార్ మాలో రెండు  సీరియల్స్ ముగింపు కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పాలి. సాగదీసి కరగదీస్తున్న కార్తీక దీపం, ఇంకోటి ముగింపు పలకడానికి రెడీగా ఉన్న గృహ లక్ష్మి. కార్తీక దీపం సీరియల్ లో దీప కష్టాలకు ముగింపు పలికి సంతోషంగా సీరియల్ ఇక ఎండ్ చేయండి అని చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు. నిజానికి ఈ సీరియల్ బాగా పాపులర్.

ఇక రెండవది గృహలక్ష్మి తులసి గొప్పతనాన్ని కుటుంబం అంతా తెలుసుకుని ఆమెను స్వీకరించడానికి రెడీగా ఉంది ఇక నందు మాత్రమే బ్యాలెన్స్. ఇలా ఈ రెండు సీరియల్స్ దాదాపు ఎండింగ్ దశలో ఉన్నట్లు అనిపిస్తుండగా ఏ కథలో ఎప్పుడు ఏ మలుపు తిప్పే సీరియల్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ రెండు సీరియల్స్ లో ఒక దానికి శుభం చెప్పి కొత్త సీరియల్ ప్రారంభిస్తారా లేక సాయంత్రం సమయంలో బిగ్ బాస్ టైమింగ్స్ ని అడ్జస్ట్ చేసి కొత్త స్లాట్ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: