టీవీ: సింగర్ రమ్య బెహరా గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలు..!!

Divya
మ్యూజిక్ ప్రపంచంలో ఎంతోమంది తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటారు.. అప్పట్లో అయితే తక్కువే కానీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో సింగర్ లకు కొరత ఏమాత్రం లేదనే చెప్పాలి.. దీనంతటికీ అసలు కారణం దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం . పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది సింగర్ లను టాలీవుడ్ కు పరిచయం చేశారు. అంతేకాదు తమ అద్భుతమైన గాత్రంతో తెలుగు సినిమాల్లో పాటలు పాడుతూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉండడం గమనార్హం.
పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ద్వారా సినీ ప్రపంచానికి పరిచయమై, అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అందం అభినయం కలిగిన సింగర్ రమ్య బెహరా.. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు పాటలు పాడుతున్నప్పటికీ టాలీవుడ్లో మాత్రం టాప్ సింగర్ లలో ఒకరిగా గుర్తింపు పొందడం గమనార్హం. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లో 1994వ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన జన్మించింది. ఇక తన విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే పూర్తిచేసుకుంది.
రమ్య బెహరా కు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు.. సంగీతం  విషయానికి వస్తే ప్రముఖ సంగీత విద్వాంసుడు రామాచారి దగ్గర సంగీతం నేర్చుకున్న రమ్య బెహరా.. వివిధ రకాల పాటల పోటీల్లో పాల్గొని స్కూల్  సమయం నుంచే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ టీవీ ప్రోగ్రాం లలో సైతం పాటలు పాడి అదరగొట్టిన రమ్య బెహరా.. దేశ, విదేశ సంగీత కచేరీల్లో పాల్గొని శ్రోతలను బాగా అలరించింది.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మెప్పు పొందిన రమ్య బెహరా ఈయన ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వెంగమాంబ సినిమా ద్వారా ఆమె పాటల ప్రయాణం మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్, టెంపర్, బ్రూస్ లీ, కృష్ణాష్టమి ఇలా ఎన్నో సినిమాలకు పాటలను అందించి ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: