బిగ్ బాస్ 5: షణ్ముఖ్ దీప్తి ల మధ్య అంతా సెట్...
వీరికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమకు గుర్తుగా ఒకరి చేతులపై మరొకరు వారి పేర్లను టాటూలు కూడా వేసుకున్నారు.. ఇక దీప్తి సునైన బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళాక నటుడు తనీష్ తో ఎంత క్లోజ్ గా ఉన్నదో తెలిసిందే. వీరి రొమ్యాన్స్ పై పలు వార్తలు భగ్గుమన్నాయి. దీంతో సునైన హౌజ్ లో తనీష్ కి మరింత దగ్గరవడం చూసి బయట షన్ను బాగా హర్ట్ అయ్యాడని ...దీప్తితో తన ప్రేమ బందాన్ని కూడా వదులుకున్నాడు అని వార్తలు వెల్లువెత్తాయి. దీప్తి హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా షన్నును కలవకపోవడంతో ఈ వార్తలు మరింత జోరును పెంచాయి. ఆ తర్వాత కట్ చేస్తే హీరో తనీష్ దీప్తి తనకి చెల్లెలు లాంటిది అని క్లారిటీ ఇచ్చారు. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ స్టేట్మెంట్ తర్వాత దీప్తి సునైన, షన్ను ల జంట మళ్ళీ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుందని అనుకున్నారు. కానీ కొన్నాళ్లుగా వీరు బయట పెద్దగా కనిపించలేదు. ఆ తరవాత ఒకసారి మీడియాతో మాట్లాడిన షన్ను...తన చేతిని దీప్తి గుర్తుగా ఉన్న టాటు చూపించి ఇది పోయేంత వరకు నా ప్రేమ పోదని స్పష్టం చేశారు. వీరి ప్రేమ గురించి ఇంట్లో కూడా తెలుసు వారు ఒప్పుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా బాగా సెటిల్ అయ్యాక వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.