బిగ్ బాస్ 5:శ్రీరామ్ తో స్నేహం చాలా ప్రమాదం...?

VAMSI
బిగ్ బాస్ హౌజ్ లో అసలు టెన్షన్ మొదలయ్యింది. ఉన్నది ఇక ఏడుమందే..శ్రీ రామ్ చంద్ర, సన్ని, కాజల్, మానస్, ప్రియాంక సింగ్, కాజల్, షన్ను ఇంకా సిరి. కాగా నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు ఊహించని విధంగా రవి హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. కొన్ని మీడియాల ద్వారా ఈ విషయం ముందే లీకైంది. కానీ హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న అతడు ఎలా ఎలిమినేట్ అవుతాడులే అని అంతా అనుకున్నారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రవినే ఎలిమినేట్ అయ్యాడు. జాగ్రత్తగా గమనిస్తే దీనికంతటికీ కారణం శ్రీ రామ్ స్నేహమే అంటున్నాయి కొన్ని సర్వేలు. అవునండి, ఇతగాడితో క్లోజ్ గా ఉన్న ప్రతి ఒక్కరూ ఇపుడు ఇంటి బయటే ఉన్నారు.
శ్రీ రామ్ హౌజ్ లోకి వచ్చినపుడు హమీదతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. మసాజ్ లు , మడత కాజాలు అంటూ అబ్బో వీరి మధ్య చాలానే జరిగాయి. అయితే అలాంటి సమయం లోనే హమీదా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత చాలా రోజులకు రామ్ , విశ్వతో క్లోజ్ అయ్యాడు. ఇద్దరు కలసి గట్టిగా గేమ్ ఆడేవారు అలాంటిది విశ్వ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడన్నది ఇప్పటికీ చాలా మందికి ప్రశ్నార్ధకమే. ఆ తర్వాత అనీ మాస్టర్ తో స్నేహంగా ఉంటూ వచ్చాడు రామ్. ఆమె ఎలిమినేషన్ లో ఉందని ఎలక్షన్ ఫ్రీ పాస్ కోసం గట్టిగా ప్రయత్నించాడు కూడా...కానీ అది కాస్త సన్నీకి దక్కింది.
ఆ తర్వాత అనీ మాస్టర్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత రవికి బాగా దగ్గరయ్యాడు శ్రీ రామ్. ఇద్దరు బ్రదర్స్ అనుకుంటూ చక్కగా ఉన్న సమయంలో ఇపుడు అనుకోకుండా రవి కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ పై అలా లుక్కేసిన కొన్ని సర్వేలు శ్రీ రామ్ తో స్నేహం చేస్తే చాలు ఇక నెక్స్ట్ హౌజ్ నుండి ఔట్ అయ్యేది వారే అంటూ చెబుతున్నారు. మరి రామ్, నెక్స్ట్ ఎవరు...?? అంటున్నారు. ప్రేమతో హౌజ్ నుండి బయటకు పంపుతున్న శ్రీ రామ్ చంద్ర అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి హౌజ్ లో మనోడితో స్నేహం ఎలిమినేషన్ కి ఫ్రీ పాస్ లా పనిచేస్తుంది అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: