టీవీ: సీరియల్స్ నటులపై షాకింగ్ కామెంట్స్ చేసిన అంజనా శ్రీనివాస్..!!
అసలు నటన అనే పదానికి కూడా అర్థం తెలియని ఒక ఆమె బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.. తను ఎవరో కాదు మిఠాయి కొట్టు చిట్టెమ్మ గా అందరిని బాగా అలరిస్తున్న నటి అంజనా శ్రీనివాస్. ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ ఇండస్ట్రీ లోకి రాలేదు.. నేను తప్ప మా ఇంట్లో అందరూ ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు.. మాస్ అమ్మ ప్రభుత్వ టీచర్.. మా నాన్న మరొక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
మా అమ్మ లాగే నేను కూడా ఒక మంచి టీచర్ కావాలని ఎన్నో కలలు కన్నాను.. ఇక ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, మేకప్ వేసుకొని తెర ముందు కనిపించాలనే ఆలోచన ఎప్పుడూ కలగలేదని ఆమె చెప్పింది. మేకప్ మాన్ వల్లే నా జీవితం మారిపోయింది అంటూ కూడా అంజనా తెలిపింది. ఇక 2012లో కృష్ణా రుక్మిణి అనే కన్నడ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని ఈమె తెలిపింది. మొదటి సీరియల్ హిట్ అవ్వడంతో వెనుతిరిగి చూడలేదు. 2014 లో తెలుగు లో నటించే అవకాశం వచ్చినా భాష సమస్య వున్న తెలుగులో నటించాలంటే ఎంతో భయపడ్డాను.
కన్నడ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు రెండు సంవత్సరాలపాటు సెట్ లో ఏ ఒక్కరు కూడా నాతో సంతోషంగా మాట్లాడిన వాళ్ళు లేరు.. నాకు నటించడం రాదు అని అందరూ మాట్లాడుకునే వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా నన్ను దగ్గరకు తీసుకోలేదు.. అందరూ నా నటన చూసి విసుక్కున్నారు అంటూ ఆమె వాపోయింది.