సీరియల్ నటికి ఐటెం సాంగ్ ఆఫర్?
ఇలా చాలా మంది సినీ తారలు సినీ రంగంలో ఉన్నారు. కాగా ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ ఏమిటంటే ఓ సీరియల్ నటి స్టార్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అది మరి ఇంకెవరో కాదు 'ఆమె కథ' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటి మహేశ్వరి. ఈమె 'నా పేరు మీనాక్షి' వంటి పలు సీరియల్స్ తో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే ఈ కన్నడ భామకు ఓ స్టార్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈమె సింగిల్ గా కాదట ఆ సినిమాలోని హీరోయిన్ కూడా ఆ ప్రత్యేక పాటలో స్టెప్పులు వేయబోతుండగా, ఆమెతో పాటు మరో డ్యాన్సర్ గా నవ్య స్వామి ఆ హీరోయిన్ తో పాటు కలసి ఆ స్పెషల్ సాంగ్ లో చిందులేయనుంది అని సమాచారం. అయితే ఇదే విధంగా ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అయితే అవకాశాలు అందిపుచ్చుకున్న అందరూ రాణించలేరన్నది కాదనలేని వాస్తవం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.