ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రవి తాజాగా మన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు.. ఆయన మంగళవారం సాయంత్రం బిగ్ బాస్ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. నిజానికి బిగ్బాస్ హౌస్లో ఎంతో చురుగ్గా పాటిస్పేట్ చేస్తూ అందరి మనసులను గెలుచుకొన్న రవి, అంత త్వరగా ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు.. యాంకర్ రవి తో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరూ కూడా రవి ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు.. ఒక్కసారిగా రవి ఎలిమినేట్ అయ్యాడని బిగ్ బాస్ ప్రకటించడంతో ఆయన అభిమానులంతా అవాక్కయ్యారు..
టాప్ ఫైవ్ లో ఉండాల్సిన రవి చివరి వరకు ఉండాల్సిన రవి ఎందుకు సడన్గా ఎలిమినేట్ అయ్యాడు అని ఆరా తీయడం కాకుండా అన్నపూర్ణ స్టూడియో ముందు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. బయటకు వచ్చాక అందరి మాటలు విన్న రవి కూడా తన ఎలిమినేషన్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని బిగ్ బాస్ టీం మీద పరోక్షంగా ఆయన ఆరోపణలు చేశాడు. ఆయనను కావాలనే ఇంట్లో నుంచి బయటకు పంపించారు అని కూడా తెలిపారు.
ఇకపోతే బిగ్బాస్ ఇంట్లో జరిగే ఆట ఒక ఎత్తయితే బయట జరిగే ఆట మరొక ఎత్తు.. ఆటను మరోలా ప్రొజెక్ట్ చేయడం వల్లే ట్రోల్స్ , మీమ్స్ ,ఎక్కువయ్యాయి.. అంతేకాదు హౌజ్ నుంచి బయటకు వచ్చిన రవి, ఇన్స్టా గ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ.. నేను చేసింది ఒకటైతే బయట ఇంకోలా చూపించారు అంటూ తెలిపాడు. నేను ముందే చెప్పాను బిగ్ బాస్ హౌస్ ఇంటికి లోపలికి వెళ్ళేటప్పుడు నన్ను ఎవరు ఎలా అయినా సరే మీఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చెప్పాను. మీరూ అలానే చేశారు. నా ఫ్యామిలీ జోలికి ఎవరో వచ్చారు. నా భార్య మీద కూడా చండాలంగా ట్రోల్ చేశారు.. చివరికి మా పాపను కూడా వదలలేదు.. నాకు తెలిసి ఒక బ్యాచ్ ఉంది వారిని ఏం చేయాలో కూడా తెలియడం లేదు. వాళ్లకి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే చాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు.. అని తన బాధను వ్యక్తపరిచాడు రవి.